యాక్టర్లు, డైరెక్టర్లు అవ్వొచ్చు.. సినీ ప్రపంచంలోకి రమ్మంటున్న దిల్‌‌‌‌‌‌‌‌ రాజు

యాక్టర్లు, డైరెక్టర్లు అవ్వొచ్చు.. సినీ ప్రపంచంలోకి రమ్మంటున్న దిల్‌‌‌‌‌‌‌‌ రాజు

కొత్తగా సినిమా ఇండస్ట్రీలో రావాలనుకునే వాళ్లకు గైడెన్స్ ఇచ్చే ఒక  రైట్ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్ క్రియేట్ చేయాలని  ‘దిల్‌‌‌‌‌‌‌‌ రాజు డ్రీమ్స్‌‌‌‌‌‌‌‌’ అనే నూతన నిర్మాణ సంస్థను ప్రారంభించబోతున్నట్టు దిల్ రాజు ప్రకటించారు. సోమవారం సంస్థ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోగోను విడుదల చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘సినిమాపై ప్యాషన్ ఉన్న వాళ్లకు సరైన వేదిక ఉండాలని దీన్ని స్టార్ట్  చేస్తున్నాం.  డ్యామేజ్‌‌‌‌‌‌‌‌ కంట్రోల్ చేస్తూ, ఫెయిల్యూర్స్‌‌‌‌‌‌‌‌ను తప్పిస్తూ రైట్ ఫిల్మ్ బయటకు వెళ్లేలా కార్పొరేట్ స్టైల్‌‌‌‌‌‌‌‌లో దీన్ని రెడీ చేశాం. ప్రొడక్షన్ టీమ్, క్రియేటివ్ టీమ్, అడ్వైజ్ టీమ్, లీగల్ టీమ్ అంటూ ఐదు రకాల టీమ్స్ ఏర్పాటుచేశాం. ఒక సినిమా తీయాలనుకునే నిర్మాత ఆ టీమ్స్‌‌‌‌‌‌‌‌ను సంప్రదిస్తే దిల్ రాజు డ్రీమ్స్‌‌‌‌‌‌‌‌తో కలిసి పనిచేయొచ్చు. అలాగే యాక్టర్స్,  డైరెక్టర్స్, టెక్నీషియన్స్ కూడా రావొచ్చు. ఇండస్ట్రీకి రావాలనుకునే వాళ్లకు 360 డిగ్రీస్‌‌‌‌‌‌‌‌లో కవర్ చేసేలా ఇది ఉంటుంది. ఇందుకు ఓ వెబ్ సైట్‌‌‌‌‌‌‌‌ను క్రియేట్ చేశాం. నా బర్త్‌‌‌‌‌‌‌‌ డే అయిన డిసెంబర్ 18 లేదా జనవరి 1న వెబ్ సైట్‌‌‌‌‌‌‌‌ను లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం’ అని చెప్పారు.