ఇంత యాటిట్యూడ్ ఉన్నోడితో సినిమా ఎలా అనుకున్నా.. విజయ్ దేవరకొండపై నిర్మాత నాగవంశీ ట్వీట్

ఇంత యాటిట్యూడ్ ఉన్నోడితో సినిమా ఎలా అనుకున్నా.. విజయ్ దేవరకొండపై నిర్మాత నాగవంశీ ట్వీట్

ప్రొడ్యూసర్ నాగవంశీ (Naga Vamsi) వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అంతేకాదు వరుస భారీ సక్సెస్ లతో మంచి జోష్ మీద ఉన్నాడు. ఎవరైనా కావాలని కాంట్రవర్సీ క్రియేట్ చేయాలనీ చూసిన అతనికి నచ్చదు. ఒకవేళ మరి ముందుకొచ్చి తనపై కామెంట్ చేస్తే, తనదైన శైలిలో మాట్లాడి, చెమటలు పట్టించేస్తాడు. తాజాగా ప్రొడ్యూసర్ నాగవంశీ చేసిన ట్వీట్ ఆసక్తిగా మారింది. వివరాల్లోకి వెళితే.. 

ప్రస్తుతం నాగవంశీ హీరో విజయ్ దేవరకొండతో కింగ్‌‌‌‌డమ్ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ మే30 న రిలీజ్ కానుంది. నేడు మే9న విజయ్ బర్త్ డే స్పెషల్గా ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు. తాను తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత తప్పుగా అపార్థం చేసుకున్న వ్యక్తులలో మొదటి వరుసలో విజయ్ దేవరకొండ ఉంటాడని చెప్పుకొచ్చి ఆశ్చర్యపరిచాడు. విజయ్పై ఉన్న ప్రేమను తన ఒక్క పోస్ట్ తోనే చెప్పకనే చెప్పాడు. 

ఆయన మాటల్లోనే  ‘తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత తప్పుగా అర్థం చేసుకున్న వ్యక్తులలో విజయ్ దేవరకొండ ఒకరు, మా మొదటి మీటింగ్ కు ముందు, ఇలాంటి ఆటిట్యూడ్ ఉన్న హీరోతో, నేను, గౌతమ్ ఎలా సినిమా చేయాలని ఆలోచిస్తూ ఉండేవాళ్ళం. కానీ మిమ్మల్ని కలిసిన తర్వాత, ఆ ఆలోచనలన్నీ మారిపోయాయి.

చాలా సాఫ్ట్ గా మాట్లాడే వ్యక్తులలో మీరు ఒకరు. చాలా మర్యాదగా మాట్లాడే, అతి తక్కువ మందిలో ఉంటారు. చివరగా.. స్టేజ్ మీద మైక్ పట్టుకున్నప్పుడు ప్రపంచం చూసేది వేరు, నిజమైన విజయ్ వేరు. విజయ్ దేవరకొండకి పుట్టినరోజుకు శుభాకాంక్షలు.. రాబోయే సంవత్సరాలలో మీకు మరిన్ని బ్లాక్‌బస్టర్స్ రావాలని  కోరుకుంటున్నాను ’ అంటూ నాగవంశీ Xలో రాసుకొచ్చాడు.

ఇకపోతే, గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ పీరియాడికల్ థ్రిల్లర్ మూవీపై భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే సితార ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ రాజీ పడకుండా రూపొందిస్తున్నారు. ఈ సినిమా మే 30న విడుదలకు సిద్దమవుతుంది.  తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడలో ఈ మూవీ రిలీజ్ కానుంది.