డీకే అరుణ కుమార్తె ఫిర్యాదుపై స్పందించిన పీవీపీ

V6 Velugu Posted on Jan 19, 2022

వైసీపీ నేత పీవీవీ ఎట్టకేలకు తెలంగాణ బీజేపీ నేత డీకే అరుణ కుమార్తె విషయంపై స్పందించారు. డీకే అరుణ కుమార్తె శృతి రెడ్డి పెట్టిన కేసుపై వివరణ ఇచ్చారు పొట్లూరి వరప్రసాద్. తన పై తన సిబ్బంది పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో శృతి రెడ్డి కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు  నమోదు చేశారని తనకు సమాచారం అదిందన్నారు. డీకే అరుణ కుమార్తె  శృతి రెడ్డి కావాలనే తమపై కక్ష సాధింపు చర్యలో భాగంగా పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదు చేసిందని ఆరోపించారు. పీవీపీ. ఇద్దరి మధ్య కాంపౌండ్ వాల్ నిర్మాణం విషయంలో వివాదం తలెత్తిందన్నారు. తాము నగరంలో లేనప్పుడు తన అనుచరులపై శృతి దుర్భాషలాడిందని ఆయన ఆరోపించారు. గతంలో కోర్టు పరిధిలో కేసు ఉందని.. కోర్టు ఆర్డర్ తోనే కాంపౌండ్ వాల్ నిర్మాణం చేస్తున్నమాన్నారు. ఈ మేరకు కోర్టు ఆర్డర్ కాపీ విషయాన్ని పోలీసులకు కూడా తెలియజేశామన్నారు.

ప్రస్తుతానికి హైదరాబాద్ లో తాను లేనని.. గోవాలో  ఉన్నానని తెలిపారు పీవీపీ. తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. తన సిబ్బంది అయినా సరే ఈ విషయంలో తప్పు చేస్తే మమ్మల్ని తరిమి కొట్టండన్నారు. ఇంటి వద్ద ఉన్న గోడ నిర్మాణం కోర్టు ఆర్డర్ ద్వారా చేపడుతున్నామని తెలిపారు. కావాలనే శృతి రెడ్డి ఆదేశాలు బేఖాతరు చేస్తూ తమను దూషిస్తూ తమపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో లో ఫిర్యాదు చేశారని పీవీపీ ఆరోపించారు. తాను ఎవరికీ భయపడే వ్యక్తిని కాదన్నారు. ఇలాంటి కేసులు తనపై వంద పెట్టిన తాను భయపడనన్నారు. 

ఇవి కూడా చదవండి: 

ప్రగతి భవన్ వద్ద జేసీ దివాకర్ రెడ్డి హల్చల్

ఐదు రోజుల బేబీకి కరోనా టెస్ట్

Tagged DK Aruna, PVP, Dk Aruna Daughter, Shruti Reddy, police complaint on pvp

Latest Videos

Subscribe Now

More News