ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నయనతార నిర్మించిన చిత్రం ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’. ఎస్ జె సూర్య, యోగి బాబు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఏప్రిల్ 10న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీ పద్మిని సినిమాస్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్న ప్రొడ్యూసర్ శివ ప్రసాద్ మాట్లాడుతూ ‘ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, ఫ్యూచర్ టెక్నాలజీని ఆధారం చేసుకుని డిజైన్ చేసిన స్టోరీ ఇది. టెక్నాలజీ హ్యూమన్ రిలేషన్స్, ఎమోషన్స్‌పై ప్రభావం చూపితే ఎలా ఉంటుందనేది ఇందులో చూపించబోతున్నాం.
ప్రదీప్, కృతిశెట్టి జోడీ అందర్నీ ఆకట్టుకుంటుంది. విఘ్నేష్ శివన్ డైరెక్షన్, అనిరుధ్ మ్యూజిక్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. ఈ మూవీ రైట్స్ కోసం చాలామంది ప్రయత్నించారు. కానీ మేం ముందుగా కమిట్ అయినందున మాకు ఇచ్చారు. దాదాపు 500 స్క్రీన్స్‌లో రిలీజ్ చేస్తున్నాం. డిస్ట్రిబ్యూషన్ పరంగా మేము సేఫ్‌గా ఉన్నాం. ఇక ప్రస్తుతం సుహాసిని గారితో ‘మహతి’ అనే సినిమా నిర్మిస్తున్నాం. మరాఠీలో ఒక సినిమాతోపాటు మా తమ్ముడు అజయ్‌ను హీరోగా పరిచయం చేస్తూ ‘రంగూన్ రాజా’ అనే మూవీ తీస్తున్నాం. జులైలో రిలీజ్ చేయాలనుకుంటున్నాం’ అని చెప్పారు.
