
ఈ జులైతో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు ఎన్నుకున్న ప్రస్తుత కమిటీ గడువు ముగుస్తోంది. షెడ్యూల్ ప్రకారం వెంటనే ఎన్నికలు నిర్వహించాలి. కానీ అసోసియేషన్‌లోని కొందరు వ్యక్తులు ఎన్నికలను వాయిదా వేయాలని ప్రయత్నిస్తున్నారు.
దీన్ని వ్యతిరేకిస్తూ అసోసియేషన్ బై లా ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలంటూ సోమవారం నిర్మాతలు ప్రతాని రామకృష్ణ గౌడ్, బసిరెడ్డి ఆధ్వర్యంలో తెలుగు ఫిలిం ఛాంబర్‌లోని నాలుగు సెక్టార్స్ నుంచి దాదాపు 60 మంది నిర్మాతలు ప్రస్తుత ఛాంబర్ సెక్రటరీకి మెమొరాండం సమర్పించారు.