ఇండోసోల్ సోలార్​లో ఉత్పత్తి షురూ

 ఇండోసోల్ సోలార్​లో ఉత్పత్తి షురూ

హైదరాబాద్​, వెలుగు :  షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్  అనుబంధ సంస్థ ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్  ఆంధ్రప్రదేశ్‌‌లోని నెల్లూరులోని రామాయపట్నంలో ఉన్న అత్యాధునిక సోలార్ పీవీ మాడ్యూల్ తయారీ కేంద్రంలో బుధవారం ఉత్పత్తిని ప్రారంభించింది. 500 మెగావాట్ల మాడ్యూల్స్ లైన్‌‌ను ప్రారంభించటానికి స్ట్రింగర్ యూనిట్‌‌ను ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి ఆన్ చేశారు.  

ఈ సదుపాయం ద్వారా  అత్యుత్తమ- నాణ్యత కలిగిన సోలార్ ఉత్పత్తులను అందిస్తామని కంపెనీ తెలిపింది. ఇక్కడ టన్నెల్ ఆక్సైడ్ పాసివేటెడ్ కాంటాక్ట్, హెరోజంక్షన్ టెక్నాలజీ మాడ్యూల్స్‌‌తో సహా వివిధ గ్లాస్-గ్లాస్  గ్లాస్-బ్యాక్ షీట్ల కాంబినేషన్‌‌తో 500 మెగావాట్ల పూర్తి ఆటోమేటెడ్, సోలార్ పీవీ మాడ్యూల్‌‌లను తయారు చేస్తారు.