పబ్లిక్ పాలసీపై ఆన్‌‌‌‌లైన్ కోర్సులు తెస్తం

పబ్లిక్ పాలసీపై ఆన్‌‌‌‌లైన్ కోర్సులు తెస్తం

గచ్చిబౌలి, వెలుగు: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ‘75 ఏండ్లలో పబ్లిక్ పాలసీ ఒక పునరావలోకనం’ అనే అంశంపై రాజనీతి శాస్త్ర విభాగం నిర్వహిస్తున్న జాతీయ సదస్సు శుక్రవారం ముగిసింది. చీఫ్​ గెస్టుగా   సెంట్రల్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ బి.జె.రావు, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఆస్కీ) డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ నిర్మల్యా బాగ్చి హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్మల్యా బాగ్చి మాట్లాడుతూ.. హెచ్‌‌‌‌సీయూ, ఆస్కీ ఆధ్వర్యంలో పబ్లిక్ పాలసీ బలోపేతానికై కృషి చేస్తామని చెప్పారు. పబ్లిక్ పాలసీపై పీజీ స్థాయిలో ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో కోర్సులు, పాలసీ సెంటర్‌‌‌‌‌‌‌‌ని ఏర్పాటు చేస్తామని వివరించారు. 

ప్రొ.బి.జె.రావు మాట్లాడుతూ.. ప్రభుత్వ విధానాలు సామాన్యుల కేంద్రీకృతంగా ఉండాలి అని చెప్పారు. సదస్సులో ప్రొ.ప్రకాశ్ సి. సారంగి, ప్రొ.ఈ.వెంకటేశు, ప్రొ.వీరబాబు, సదస్సు కో-ఆర్డినేటర్ ప్రొ.వెంకటేశ్, రాజనీతిశాస్త్ర విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్స్, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు.