
ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ వి.రామకిష్టయ్య శుక్రవారం ఉదయం కన్నుమూశారు. 1932 లో నల్గోండలోని మునుగోడు గ్రామంలో జన్మించిన రామకిష్టయ్య యూనివర్శిటి టాపర్. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనేక విధాలుగా సేవలందించాడు. APPSC చైర్మన్ గానూ రామకిష్టయ్య పనిచేశారు. తన నిస్వార్థమైన సేవతో, నిజాయితీ గల స్వభావంతో తెలంగాణ రాష్ట్రానికి విశేషమైన కృషి చేశారు. తెలంగాణ రాష్ట్రం గర్వించదగిన వ్యక్తిగా అనేక ప్రభుత్వ సేవల పట్ల నిబద్ధతతో పనిచేశారు. రాష్ట్రంలో ముగ్గురు ముఖ్యమంత్రుల కింద సేవ చేసిన వ్యక్తిగా ఆయనకు పేరుంది. రామకిష్టయ్యకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.