ఇథనాల్ ​కంపెనీలను రద్దు చేయాలి.. ప్రొఫెసర్ ​హరగోపాల్​ డిమాండ్​

ఇథనాల్ ​కంపెనీలను రద్దు చేయాలి.. ప్రొఫెసర్ ​హరగోపాల్​ డిమాండ్​

ముషీరాబాద్,వెలుగు: తెలంగాణ రాష్ట్రాన్ని ఇథనాల్ ముంచేయబోతుందని, వెంటనే ఆ కంపెనీలను రద్దు చేయాలని ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. ఇథనాల్ సమస్యపై ప్రధాన రాజకీయ పార్టీలు తమ వైఖరిని ప్రకటించాలని కోరారు. చిత్తనూరు ఇథనాల్ కంపెనీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రొఫెసర్ హరగోపాల్, సైంటిస్టులు కలపాల బాబురావు, సాగర్ ధార పాల్గొన్నారు. సైంటిస్ట్ బాబురావు మాట్లాడుతూ ఇథనాల్ కంపెనీలు తమ లాభాల కోసం కాలుష్యాన్ని విపరీతంగా వెదజల్లుతున్నాయన్నారు. 

మీరా సంఘమిత్ర, పశ్య పద్మ, పీఓడబ్ల్యూ ఝాన్సీ, రాఘవాచారి, వెంకట రాములు మాట్లాడుతూ ఇథనాల్ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని, ఈ కంపెనీలను రద్దు చేయకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో గోవర్ధన్, సైదయ్య, రామారావు, రామచంద్రయ్య, చక్రవర్తి, సైదమ్మ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.