జీతాలివ్వకపోవడమే కారణమని బంధువుల ఆరోపణ

జీతాలివ్వకపోవడమే కారణమని బంధువుల ఆరోపణ

కాలేజీ మేనేజ్​మెంట్ ఇంటి ముందు డెడ్​బాడీతో బంధువుల ధర్నా 

హైదరాబాద్, వెలుగు: పోచంపల్లిలోని ఓ ఫార్మసీ కాలేజీలో పనిచేసే డాక్టర్ సైదులు యశోద హాస్పిటల్​లో చికిత్స పొందుతూ బ్రెయిన్​డెడ్​తో చనిపోయారు.  వారి కుటుంబీకులు ఒప్పుకోవడంతో ఆయన అవయవాలను దానం చేశారు. అయితే కాలేజీలో కొన్ని నెలలుగా జీతాలివ్వకపోవడంతోనే మానసికంగా కుంగిపోయి సైదులు చనిపోయినట్టు కుటుంబీకులు, బంధువులు ఆరోపిస్తున్నారు. టీఎస్​టీసీఈఏ  రాష్ట్ర అధ్యక్షుడు సంతోష్​ కుమార్ ఆధ్వర్యంలో సైదులు డెడ్ బాడీతో బంధువులు మైత్రివనంలోని కాలేజీ మేనేజ్ మెంట్ ఇంటిముందు గురువారం ఆందోళన నిర్వహించారు.

సైదులు 12 ఏండ్లుగా అదే కాలేజీలో పనిచేస్తున్నాడని, 8 రోజులు హాస్పిటల్​లో ఉన్నా మేనేజ్ మెంట్ కనీసం పట్టించుకోలేదని మండిపడ్డారు. దీంతో స్పందించిన మేనేజ్ మెంట్ ఆయన పూర్తి జీతాన్ని వెంటనే ఇచ్చేందుకు అంగీకరించింది. రూ.50 వేల క్యాష్​, రూ.2.50లక్షల  చెక్కును సైదులు కుటుంబసభ్యులకు అందించింది. అనంతరం సైదులు డెడ్​బాడీని ఆయన స్వగ్రామం నకిరే
కల్​కు తరలించారు.