
ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా జరిగాయి. నిజామాబాద్లో కంఠేశ్వర్ చౌరస్తాలో జయశంకర్ సార్ విగ్రహానికి కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కామారెడ్డి కలెక్టరేట్లో కలెక్టర్ఆశిష్ సంగ్వాన్ జయశంకర్ సార్ఫొటోకు నివాళులర్పించారు. పలు మండలాల్లో జయశంకర్ సార్విగ్రహాలు, ఫొటోలకు ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆయా పార్టీల నాయకులు నివాళులర్పించారు. – వెలుగు నెట్వర్క్