
ఉస్మానియా యూనివర్సిటీలో గడ్డం వెంకటస్వామి 96వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ప్రొఫెసర్ కంచ ఐలయ్య సభను ఉద్దేశించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. గడ్డం వెంకటస్వామి అంబేద్కర్ వాది అని.. ఎంతో మంది పేదలకు గుడిసెలు వేయించి గుడిసెల వెంకటస్వామిగా పేరుగా పిలవబడ్డారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఎన్నో పదవులు అధిరోహించి యావత్ దళిత బహుజన సమాజానికి ఎంతో కృషి చేశారని అన్నారు. అంబేద్కర్ పేరుతో విద్యాసంస్థల స్థాపించి బడుగు బలహీన వర్గాల పిల్లలకు విద్య అందిస్తున్నారని అన్నారని అన్నారు ఐలయ్య.
నామ సైదులు మాట్లాడుతూ... కాకా వెంకటస్వామి బలహీన వర్గాల కోసం నిరంతరం పాటు పడిన వ్యక్తి అని.. కేంద్ర మంత్రిగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా వెంకటస్వామి బడుగు బలహీన వర్గాల ప్రజలకు అనేక సేవలందించాడని అన్నారు. దేశం గర్వించదగ్గ నాయకుడిగా నిలిచారని కొనియాడారు. హైదరాబాదులో వేలాది మంది పేద ప్రజల కోసం భూ పోరాటాలు చేసి ఇంటి స్థలాలు ఇప్పిచ్చిన ఘనత ఆయనకే దక్కిందన్నారు.
►ALSO READ | ఊళ్ళ నుంచి హైదరాబాద్ బాట పట్టిన జనం... టోల్ ప్లాజాల దగ్గర ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..
పేద ప్రజల గుండెల్లో గుడిసెల వెంకటస్వామిగా నిలిచారని గుర్తు చేశారు. కార్యక్రమంలో యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నాయకులు, తదితరులు తదితర విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.