ఊళ్ళ నుంచి హైదరాబాద్ బాట పట్టిన జనం... టోల్ ప్లాజాల దగ్గర ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..

ఊళ్ళ నుంచి హైదరాబాద్ బాట పట్టిన జనం... టోల్ ప్లాజాల దగ్గర ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..

దసరా సెలవులు ముగిసాయి.. సోమవారం ( అక్టోబర్ 6 ) నుంచి స్కూళ్ళు రీఓపెన్ అవుతున్నాయి..లాంగ్ వీకెండ్ తీసుకున్న ఎంప్లాయిస్ కూడా మళ్ళీ ఆఫీసులకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఆదివారం ( ఆక్టోబర్ 5 ) ఊళ్ళ నుంచి అంతా హైదరాబాద్ కు బయలుదేరారు. దీంతో హైవేలపై వాహనాల రద్దీ పెరగడంతో టోల్ గేట్ల దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. నల్గొండ జిల్లా  చిట్యాల దగ్గర NH 65 పై వాహనాల రద్దీ పెరిగింది.

చిట్యాల జాతీయ రహదారిపై ఫ్లై ఓవర్ పనులు జరుగుతుండటం, మరో వైపు దసరా సెలవులు ముగియడంతో  ఊర్ల నుంచి హైదరాబాద్ తిరిగి వెళ్తున్న వాహనాలు పెరగడంతో ట్రాఫిక్ స్లోగా కదులుతోంది. NH65 పై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవ్వడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.

►ALSO READ | ఒకటి, రెండు కాదు.. వరుసగా ఆరు కార్లు ఢీ.. హైదరాబాద్ ORR పై భారీగా ట్రాఫిక్ జామ్..

కొర్లపాడు టోల్ ప్లాజా దగ్గర కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. హైదరాబాద్ వైపు ఎనిమిది టోల్ ప్లాజాలు ఓపెన్ చేసి వాహనాలను పంపిస్తున్నారు సిబ్బంది.ఈ క్రమంలో టోల్ ప్లాజాల దగ్గర లేటు కావడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. రెండు కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.