ఒకటి, రెండు కాదు.. వరుసగా ఆరు కార్లు ఢీ.. హైదరాబాద్ ORR పై భారీగా ట్రాఫిక్ జామ్..

ఒకటి, రెండు కాదు.. వరుసగా ఆరు కార్లు ఢీ.. హైదరాబాద్ ORR పై భారీగా ట్రాఫిక్ జామ్..

హైదరాబాద్ హిమాయత్ సాగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. వరుసగా ఆరు కార్లు ఒకదానికి ఒకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆదివారం ( అక్టోబర్ 5 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లే ఔటర్ రింగ్ రోడ్ పై వరుసగా ఆరు కార్లు ఒకదానికి ఒకటి ఢీకొనడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ ఘటనలో ఆరు కార్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.

ఘటన జరిగిన సమయంలో అన్ని కార్లలో ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దసరా సెలవులు ముగియడంతో సొంతూళ్లకు వెళ్లినవారంతా సిటీకి బయలుదేరారు. దీంతో ఔటర్ పై వాహనాల రద్దీ పెరిగింది. ఈ క్రమంలో ప్రమాదం జరగడంతో సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయినట్లు సమాచారం.

►ALSO READ | మంజీర నదిలో కొట్టుకుపోతున్న యువకులను కాపాడిన పోలీసులు

ఈ ఘటనలో కార్లు పాక్షికంగా దెబ్బతినడం మినహా పెద్దగా నష్టమేమీ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కార్లలోని ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.