
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు, ఆయన నటించిన సినిమాలకు దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ వేరు. ఆయన బొమ్మ వస్తుందంటే చాలు.. సందడి వాతావరణం నెలకొంటుంది. అభిమానులు సంబరాల్లో మునిగిపోతుంటారు. 2023లో వచ్చిన ఆయన బ్లాక్‌బస్టర్ చిత్రం 'జైలర్'సాధించిన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ అద్భుత విజయానికి సీక్వెల్‌గా, ఇప్పుడు 'జైలర్ 2' తెరకెక్కుతోంది. ఇటీవల వచ్చిన 'కూలీ' మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి రజనీ స్టామినాను మరోసారి నిరూపించింది.
భారీ అంచనాల మధ్య 'జైలర్ 2'
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సీక్వెల్‌పై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ముఖ్యంగా, రజనీ నటించిన 'కూలీ' చిత్రం మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో, 'జైలర్ 2' విషయంలో చిత్ర యూనిట్ మరింత ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఇప్పటికే కేరళలో కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం, వచ్చే ఏడాది జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో స్టార్ కాస్టింగ్ మరింత పెరిగింది. ఫస్ట్ పార్ట్‌కు హైలైట్‌గా నిలిచిన మలయాళ పవర్ స్టార్ మోహన్‌లాల్, కన్నడ కైవ శివరాజ్‌కుమార్‌లతో పాటు, బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే, ప్రముఖ దర్శకుడు, నటుడు ఎస్‌జే సూర్య కూడా సినిమాలో యాక్ట్ చేస్తున్నట్లు సమాచారం. ఫస్ట్ పార్ట్‌కు మ్యూజికల్ హైలైట్‌గా నిలిచిన అనిరుధ్ రవిచందర్ సంగీతం ఈ సీక్వెల్‌కు కూడా ప్రధాన బలంగా నిలవనుంది.
హిమాలయాల్లో రజనీ ఆత్మశోధన
ఒకవైపు 'జైలర్ 2' షూటింగ్ బిజీగా ఉన్నా, రజనీకాంత్ తన ఆత్మశాంతి కోసం కొద్ది రోజుల విరామం తీసుకున్నారు. బిజీ షెడ్యూల్స్‌కు బైబై చెప్పారు. వారం రోజుల పాటు ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించారు. సాధారణ భక్తుడిలా మారిపోయారు. హిమాలయాలకు, పవిత్ర స్థలాలకు వెళ్లడం రజనీకి కొత్తేమీ కాదు. ప్రతి సినిమా విడుదల ముందు, లేదా షూటింగ్ గ్యాప్‌లో ఆయన తప్పనిసరిగా హిమాలయాలకు వెళ్లొస్తారు. 'జైలర్' రిలీజ్‌కు ముందు కూడా ఆయన ఇలాగే వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే.
►ALSO READ | Chiranjeevi: 'మన శంకర వరప్రసాద్‌గారు': కామెడీ టచ్‌తో షైన్ టామ్ చాకో పవర్‌ఫుల్ విలనిజం!
లేటెస్ట్ గాఆయన రిషికేశ్‌లోని ఆశ్రమంలో సేద తీరుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక్కడ ఆయన సాధారణ భక్తుడిలా కనిపించడం అభిమానులను ఆకట్టుకుంది. రిషికేశ్‌తో పాటు, బద్రీనాథ్, బాబా గుహ వంటి పుణ్యక్షేత్రాలను కూడా ఆయన దర్శించుకున్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్‌డమ్ ఉన్నా, రజనీకాంత్ ఈ విధంగా ప్రకృతిలో, ఆధ్యాత్మిక చింతనలో గడపడం ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడుతోందంటున్నారు అభిమానులు. తిరిగి వచ్చిన తర్వాత ఆయన 'జైలర్ 2' షూటింగ్‌లో పాల్గొని, సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేయనున్నారని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
இமயமலையில் தலைவர் @rajinikanth pic.twitter.com/AdiWqwS39C
— Sholinghur N Ravi (@SholinghurRavi) October 5, 2025