ఇంట్రెస్టింగ్, సస్పెన్స్ తో ఈ వారం ఓటిటిలో రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్లు ఇవే..

ఇంట్రెస్టింగ్, సస్పెన్స్ తో ఈ వారం ఓటిటిలో రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్లు ఇవే..

ఈ వారం ఓటిటిలోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు మీకు కాస్త సస్పెన్స్, ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేస్తాయి. అలాగే  ఈసారి ఆన్ లైన్ గేమ్స్, పొలిటికల్ థీమ్ తో కూడా సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలను ఫ్యామిలీ మొత్తం కలిసి చూడొచ్చు.     

స్టార్టప్‌ పెట్టాలని..

టైటిల్ : 13వ, 
ప్లాట్​ ఫాం : సోనీలివ్‌
డైరెక్షన్ :  నిశిల్ సేత్
కాస్ట్​ : గగన్ దేవ్ రియర్, పరేష్ పహుజా, గిరిజా ఓక్ గాడ్బోలే, ప్రద్న్య మోత్ఘరే, అభిషేక్ రంజన్

జితేశ్ (పరేశ్ పహుజా) ఒక కార్పొరేట్ సంస్థలో కీలకమైన పొజిషన్‌‌లో పనిచేస్తుంటాడు. అయితే.. ఆ కంపెనీలో మిగతావాళ్లు తీసుకునే కొన్ని నిర్ణయాలను జితేశ్‌‌ వ్యతిరేకిస్తాడు. అవి సామాన్య ప్రజలను దోచుకునేలా ఉన్నాయని భావించి చివరకు ఉద్యోగం మానేస్తాడు. తర్వాత తనే ఒక స్టార్టప్‌‌ పెట్టాలని డిసైడ్‌‌ అవుతాడు. దాని ద్వారా విద్యారంగంలో మార్పులు తీసుకురావాలి అనుకుంటాడు. అందుకే కొన్నేండ్ల క్రితం తనకు ఐఐటీ కోచింగ్ ఇచ్చిన లెక్చరర్ మోహిత్ త్యాగి (గగన్ దేవ్ రియర్)ని కలుస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? స్టూడెంట్స్‌‌కి నాణ్యమైన విద్యను అందించాలనే వాళ్ల లక్ష్యం నెరవేరిందా? స్టార్టప్‌‌ పెట్టడంలో వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? తెలుసుకోవాలంటే ఈ వెబ్‌‌సిరీస్‌‌ చూడాలి. 

 
అధికారం కోసం..

టైటిల్ : నాలై నమదే, 
ప్లాట్​ ఫాం : ఆహా (తమిళ్​)
డైరెక్షన్ : వెంబా కతిరేశన్,
కాస్ట్​ : మధుమిత, వెల్‌మురుగన్, రాజలింగం, సెంథిల్ కుమార్, మురుగేశన్, మరిక్కణ్ణు, కోవై ఉమ

తమిళనాడులోని శివగంగ జిల్లాలో అధికారులు పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తుంటారు. షెడ్యూల్డ్‌‌ కులాలవాళ్లు తక్కువగా ఉండే ఒక ఊరిలో ఆ కులాలకే సర్పంచ్‌‌ పదవిని కేటాయిస్తారు. దాంతో షెడ్యూల్డ్ కులానికి చెందిన ఒక అభ్యర్థి పోటీ చేస్తాడు. అందుకు అంగీకరించని ఇతర కులాల వాళ్లు ఆ అభ్యర్థితో సహా అనేకమందిని చంపి, అల్లర్లు సృష్టిస్తారు. దాంతో అధికారులు ఆ గ్రామాన్ని మళ్లీ జనరల్‌‌ పంచాయతీగా ప్రకటిస్తారు. ఆ తర్వాత ఒకే వ్యక్తి 15 ఏండ్లపాటు చైర్మన్‌‌గా పనిచేస్తాడు. కానీ.. గ్రామం ఏమాత్రం అభివృద్ధి చెందదు. దాంతో మళ్లీ షెడ్యూల్డ్ కులాలకు రిజర్వేషన్‌‌ ప్రకటిస్తారు. 15 ఏండ్ల క్రితం హత్యకు గురైన వ్యక్తి మనవరాలు అముధ(మధుమిత) సర్పంచ్‌‌గా పోటీ చేస్తుంది. ఈసారి ఆమెని ఏమీ చేయలేక షెడ్యూల్డ్‌‌ కులానికి చెందిన ఒక కీలుబొమ్మ అభ్యర్థిని ఆమెకు పోటీగా నిలబెడతారు. వాళ్లంతా కలిసి అముధను ఓడించడానికి ఏం చేశారు? ఆమె ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంది? తెలుసుకోవాలి అంటే సినిమా చూడాలి. 

===================================================================

దాడి చేసిందెవరు? 

టైటిల్ : ది గేమ్‌: యు నెవర్‌ ప్లే ఎలోన్‌
ప్లాట్​ ఫాం : నెట్‌ఫ్లిక్స్‌
డైరెక్షన్ :  రాజేశ్‌ ఎం.సెల్వ
కాస్ట్​ : శ్రద్ధా శ్రీనాథ్‌, సంతోష్ ప్రతాప్‌, చాందినీ, శ్యామ హరిణి, బాల హసన్‌, సుభాష్‌

కావ్యా రాజారాం (శ్రద్ధా శ్రీనాథ్) గేమ్ డెవలపర్‌‌‌‌గా ఒక స్టార్టప్‌‌లో పనిచేస్తుంటుంది. తనతోపాటే పనిచేస్తున్న అనూప్ (సంతోష్ ప్రతాప్)ని ప్రేమించి పెండ్లి చేసుకుంటుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌‌గా ఉండే కావ్య అప్పుడప్పుడు ట్రోల్స్‌‌కు గురవుతుంటుంది. ఆమె డిజైన్‌‌ చేసిన ‘గ్లాస్ సీలింగ్’ గేమ్‌‌ బాగా ఆదరణ పొందుతుంది. అందుకుగాను ఆమె ఒక అవార్డ్‌‌ కూడా గెలుచుకుంటుంది. అవార్డు అందుకున్న రోజు రాత్రి కావ్య తన ఫ్రెండ్‌‌ని కలవడానికి వెళ్తుంది. దారి మధ్యలో గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై దాడి చేసి, పర్స్, ఫోన్, అవార్డును లాక్కుంటారు. ఇన్‌స్పెక్టర్ భానుమతి (చాందిని) ఈ కేసు ఇన్వెస్టిగేషన్‌‌ని మొదలుపెడుతుంది. మరోవైపు కావ్య కూడా ఆఫీసులో తనతోపాటు పనిచేసే టెక్ టీం సాయంతో దాడి చేసింది ఎవరు? అనేది తెలసుకునేందుకు ప్రయత్నిస్తుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అనేదే మిగతా కథ. 

►ALSO READ | నటులను నెత్తిమీద పెట్టుకొని ఊరేగకండి.. సత్యరాజ్ సంచలనం వ్యాఖ్యలు వైరల్ !