
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ శనివారం హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.
16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వీటిలో ఆసిఫాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, కొత్తగూడెం, ములుగు, మెదక్, కామారెడ్డి, సిద్దిపేట, జనగామ, హనుమకొండ, ఖమ్మం , వరంగల్, సూర్యాపేట, మహబుబాబాద్ జిల్లాలు ఉన్నాయి. కాగా, శనివారం అత్యధికంగా ములుగు జిల్లా ఏటూరు నాగరంలో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లా లింగాలలో 9.3, ఖమ్మం రూరల్ లో 8.9, మేడారంలో 8.4, జనగామ జిల్లా గూడూరులో 7.3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.