హాలిడే ట్రిప్కు వెళ్లి ఇదేం పని..? సింగపూర్లో ఇద్దరు ఇండియన్స్కు ఐదేళ్ల జైలు, 12 బెత్తం దెబ్బల శిక్ష

హాలిడే ట్రిప్కు వెళ్లి ఇదేం పని..? సింగపూర్లో ఇద్దరు ఇండియన్స్కు ఐదేళ్ల జైలు, 12 బెత్తం దెబ్బల శిక్ష

సెలవులు ఎంజాయ్ చేయడానికి వెళ్లారు. ఎంజాయ్ చేశారు. కానీ.. అదే టైమ్ లో సెక్సు వర్కర్లను దోచుకుని దాడి చేశారనే ఆరోపణలతో ఇద్దరు ఇండియన్స్ జైలు పాలయ్యారు. విచారణలో నేరం అంగీకరిచడంతో ఇద్దరు భారతీయులకు సింగపూర్ కోర్టు శుక్రవారం (అక్టోబర్ 03) ఐదేళ్ల జైలు శిక్షతో పాటు 12 బెత్తం దెబ్బలల శిక్ష విధించడం చర్చనీయాంశంగా మారింది.

తమిళనాడుకు చెందిన 23 ఏళ్ల అరొక్కియసామి డైసన్, 27 ఏళ్ల రాజేంద్రన్ మయిలరసన్ అనే ఇద్దరు ఇండియన్స్.. హాలిడేస్ ను ఎంజాయ్ చేయడానికి ఏప్రిల్ 24న సింగపూర్‌కు వెళ్లారు. రెండు రోజుల తర్వాత వారికి ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. అమ్మాయిలు కావాలా అని అడగడంతో కావాలని తలూపారు. ఇద్దరు మహిళల నెంబర్లు ఇచ్చాడు ఆ సదరు వ్యక్తి. 

మనకు డబ్బు అవసరం.. ఆ మహిళల నుంచే కొట్టేందాం అని అరోక్కియా రాజేంద్రన్ తో ప్లాన్ చెప్పగా ఓకే అనేశాడు. దీంతో వేశ్యల దగ్గరికి వెళ్లి వాళ్ల దగ్గరే డబ్బు దోచుకోవాలని డిసైడ్ అయ్యారు. 

కాళ్లూ, చేతులు కట్టేసి..

ప్లాన్ ప్రకారం హోటల్ కు వెళ్లిన ఇద్దరు.. ఒక మహిళను హోటల్ రూమ్ లో కాళ్లూ, చేతులూ కట్టేసి బంధించారు. ఆమెపై దాడి చేసి, నగలు, నగదు, పాస్‌పోర్ట్, బ్యాంక్ కార్డులతో పాటు 2 వేల సింగపూర్ డాలర్లు దోచుకున్నారు. అదే రాత్రి 11 గంటలకు మరొక మహిళ నుంచి 8 వందల సిగపూర్ డాలర్లు, రెండు ఫోన్లు, పాస్ పోర్టు లాగేసుకున్నారు. తాము చెప్పే వరకు రూమ్ వదిలి వెళ్తే పాస్ పోర్టు ఇవ్వమని బెదిరించారు.

►ALSO READ | లండన్లో తెలంగాణ విద్యార్థి మృతి

మరుసటి రోజు బాధితుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, ఇద్దరినీ అరెస్ట్ చేశారు. విచారణలో మహిళలను బెదిరించి దోచుకున్నట్లు తప్పు ఒప్పుకున్నారు. కోర్టులో కూడా చేసిన తప్పు అంగీకరించడంతో సింగపూర్ చట్టం ప్రకారం శిక్షలు విధించారు న్యాయమూర్తి. నా తండ్రి చనిపోయాడు.. నాకు ముగ్గురు చెల్లెళ్లున్నారు..వాళ్ల పెళ్లి చేయడానికి కూడా డబ్బులు లేవు. అందుకో ఈ పని చేసినట్లు కోర్టు ముందు రాజేంద్రన్ చెప్పినట్లు సింగపూర్ డెయిలీ పేర్కొంది.