యూట్యూబ్ కొత్త ఫీచర్.. ఇప్పుడు ఏ పాటైనా, ఏ భాషలోనైనా.. ఈజీగా సెట్ చెయ్యొచ్చు..

యూట్యూబ్ కొత్త ఫీచర్.. ఇప్పుడు ఏ పాటైనా, ఏ భాషలోనైనా.. ఈజీగా సెట్ చెయ్యొచ్చు..

ఇప్పటికే యూట్యూబ్​లో కంటెంట్‌ వీడియోలు అప్​లోడ్ చేస్తే ఆటోమేటిక్​గా ఇంగ్లిష్​ భాషలోకి ట్రాన్స్​లేట్ అయి ప్లే అవుతున్నాయి. దీంతో ఎక్కువమంది వ్యూయర్స్​కు వీడియో రీచ్ అవుతుంది. అయితే ఇప్పుడు ఇదే స్ట్రాటజీతో ఎక్కువమంది యూజర్లకు రీచ్ అవ్వాలని వీడియోలకు కూడా కొత్త ఆప్షన్లు తీసుకొచ్చింది. వీడియోకు బ్యాక్​గ్రౌండ్​ సాంగ్​ సెట్ చేసేటప్పుడు ఇంతకుముందు అయితే కొన్ని భాషల్లో మాత్రమే ఆప్షన్లు ఉండేవి. కానీ ఇప్పుడు రకరకాల ఆడియో ట్రాక్​లను ట్యాగ్ చేసే వీలు కల్పించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూట్యూబ్ యూజర్లకు ఈజీగా రీచ్ అవుతుంది. అయితే, క్రియేటర్లు రికార్డ్ చేసి లేదా ఇతర భాషల్లోకి ట్రాన్స్​లేట్ చేసి సబ్​ టైటిల్స్ ఎడిటర్ ద్వారా అప్​లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఆ సాంగ్​ వీడియోకు ట్యాగ్ చేయొచ్చు. ఒక వీడియోకు ఒక భాషలో ట్రాక్ ఉంటే, మరో చానెల్​లో వేరే భాషతో అప్​లోడ్ చేయాలన్నప్పుడు ఈ ఫీచర్ బాగా పనికొస్తుంది. చూసేవాళ్లు కూడా వాళ్లకు నచ్చిన భాషను ఎంచుకోవచ్చు. వీడియో ప్లేయర్ మీద సెట్టింగ్స్ సింబల్ ట్యాప్ చేసి ఆడియో ట్రాక్​ ఆప్షన్​లో లాంగ్వేజ్ సెలక్ట్ చేసుకోవాలి. 

►ALSO READ | గేమర్లకు బెస్ట్ మౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్యాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఒకే టచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయొచ్చు..