IND VS PAK: మహిళల సమరం: పాకిస్థాన్‌తో మ్యాచ్.. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌ చేయనున్న ఇండియా

IND VS PAK: మహిళల సమరం: పాకిస్థాన్‌తో మ్యాచ్.. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌ చేయనున్న ఇండియా

విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వన్డే వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా ఆదివారం (అక్టోబర్ 05) ఇండియా–పాకిస్తాన్ మధ్య హై ఓల్టేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్ ప్రారంభమైంది. కొలంబో వేదికగా ప్రాంభమైన ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ మహిళా జట్టు  బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో ఇండియా ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది. తొలి మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన అమన్ జ్యోత్ కౌర్ స్థానంలో రేణుక ఠాకూర్ జట్టులోకి వచ్చింది. మరోవైపు పాకిస్థాన్ కూడా ఒక మార్పుతో బరిలోకి దిగింది. ఒమైమా సోహైల్ స్థానంలో సదాఫ్ షమాస్ ప్లేయింగ్ 11 లో స్థానం సంపాదించింది. 

తొలి వన్డేలో ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రౌండర్ పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో శ్రీలంకపై గ్రాండ్ విక్టరీ సాధించిన మన టీమ్ ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జోష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉండగా.. బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేతిలో 7 వికెట్ల తేడాతో అనూహ్యంగా చిత్తయిన పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వాన ముప్పు పొంచి ఉండటం కాస్త ఆందోళన కలిగిస్తోంది. ఆసియా కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాక్ ప్లేయర్లకు సూర్యకుమార్ సేన షేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హ్యాండ్ ఇవ్వకపోవడంతో ఇరు జట్ల మధ్య రచ్చ మొదలవగా.. ఇండియా అమ్మాయిలు కూడా పాక్‌తో ‘నో హ్యాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షేక్’  ప్రొటోకాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కొనసాగించనున్నారు. 

►ALSO READ | Rohit Sharma: '77 జెర్సీ' శకం స్టార్ట్ అవుతుందని రోహిత్ ఎలా అంచనా వేశాడు.. హిట్ మ్యాన్ 13 ఏళ్ళ క్రితం ట్వీట్ వైరల్

ఇంటర్నేషనల్ క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇరు దేశాల మహిళల జట్లు అన్ని ఫార్మాట్లలో కలిపి ఇప్పటివరకు 27 సార్లు తలపడగా, ఇండియా 24 మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో  గెలిచింది. వన్డే ఫార్మాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అయితే పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఆడిన 11 మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లోనూ నెగ్గి 100 శాతం సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రికార్డుతో ఉంది.  అదే జోరును ఇప్పుడు కూడా కొనసాగించాలని హర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సేన భావిస్తోంది. 

పాకిస్థాన్ మహిళలు (ప్లేయింగ్ XI):

మునీబా అలీ, సదాఫ్ షమాస్, సిద్రా అమీన్, రమీన్ షమీ, అలియా రియాజ్, సిద్రా నవాజ్(వికెట్ కీపర్), ఫాతిమా సనా (కెప్టెన్), నటాలియా పర్వైజ్, డయానా బేగ్, నష్రా సంధు, సాదియా ఇక్బాల్

భారత మహిళలు (ప్లేయింగ్ XI): 

ప్రతీకా రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), స్నేహ రాణా, రేణుకా సింగ్ ఠాకూర్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి