
2027 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని సెలెక్టర్లు వన్డే కెప్టెన్సీలో మార్పులు చేశారు. ఇండియాకు చాంపియన్స్ ట్రోఫీ అందించిన హిట్‌మ్యాన్ రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి యంగ్ సెన్సేషన్ శుభ్‌మన్ గిల్‌కు జట్టు పగ్గాలు అప్పగించారు. ఇప్పటి నుంచే గిల్ కు కెప్టెన్ గా అవకాశమిస్తే 2027 వరల్డ్ కప్ లోపు అనుభవాన్ని సంపాదించుకుంటాడనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్టు సమాచారం. సెలక్షన్ కమిటీ తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయం అతని ఫ్యాన్స్ ను తీవ్ర నిరాశకు గురి చేస్తుంది. రోహిత్ శర్మ సాధించిన విజయాలను పరిగణలోకి తీసుకుంటే హిట్ మ్యాన్ కు అన్యాయం జరిగిందని కొంతమంది ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో రోహిత్ 2012 లో చేసిన ట్వీట్ ఒకటి తెగ వైరల్ అవుతుంది.
13 సంవత్సరాల క్రితం 2012లో రోహిత్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ఒక శకం (45) ముగింపు. కొత్త శకం (77) ప్రారంభం" అని హిట్ మ్యాన్ తన ఎక్స్ లో రాసుకొచ్చాడు. రోహిత్ జెర్సీ నెంబర్ 45 కాగా.. గిల్ జెర్సీ నెంబర్ 77. రోహిత్ అప్పుడు చేసిన ట్వీట్ ఇప్పుడు గిల్ కొత్త కెప్టెన్ అయిన తర్వాత సరిగ్గా సరిపోతుంది. గిల్ ను వన్డే కెప్టెన్ గా ప్రకటించగానే మాజీ సారధి రోహిత్ ఇంకా స్పందించలేదు. అయితే హిట్ మ్యాన్ 13 ఏళ్ళ క్రితం చేసిన ట్వీట్ ఎలా ఉందంటే తాజాగా ఎంపికైన గిల్ ను ప్రశంసించేలా ఉంది. 2012 లో గిల్ క్రికెట్ లో అడుగు పెట్టలేదు. అతని జెర్సీ నెంబర్ 77 అవుతుందని కూడా రోహిత్ ఊహించి ఉండడు.
77 జెర్సీ ఎరా మొదలవుతుందని ఎందుకు చెప్పాడో రోహిత్ కే తెలియాలి. అప్పట్లో రోహిత్ కొని మ్యాచ్ లకు 77 జెర్సీ కూడా ధరించినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత 45 జెర్సీని కొనసాగించాడు. కొంతమంది ఏమంటున్నారంటే.. రోహిత్ 45 జెర్సీ వేసుకొని విఫలమయ్యాడని.. అప్పుడు 77 జెర్సీ వేసుకొని ఫామ్ లోకి వచ్చాడని.. ఈ కారణంగానే ఆ ట్వీట్ చేస్తున్నట్టు అంచనా వేస్తున్నారు. మొత్తానికి రోహిత్ ఎప్పుడో చేసిన ట్వీట్ ఇప్పుడు పర్ఫెక్ట్ గా సూటవ్వడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
చివరిసారిగా రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది. ఇప్పటికే టెస్ట్, టీ20 ఫార్మాట్ నుంచి దూరమైన హిట్ మ్యాన్ వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. మూడు ఫార్మాట్ లకు ముగ్గురు కెప్టెన్ లను కొనసాగడం బీసీసీఐ ఆలోచనల్లో లేనట్టు స్పష్టమవుతుంది. రోహిత్ శర్మ ప్రస్తుత వయసు 37 సంవత్సరాలు. 2027 వన్డే వరల్డ్ కప్ వరకు రోహిత్ శర్మ ఆడతాడా లేదా అనేది అతని ఫామ్, ఫిట్ నెస్ పై ఆధారపడి ఉంటుందని అగార్కర్ పరోక్షంగా చెప్పుకొచ్చాడు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ రోహిత్‌తో పాటు సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీని ఆస్ట్రేలియా టూర్‌కు సెలెక్ట్ చేసింది.
Rohit Sharma's old tweet goes viral after captaincy snub in ODIs#cricket #RohitSharma #ODI #captain pic.twitter.com/Z1HdqgQ8dj
— CricketTimes.com (@CricketTimesHQ) October 5, 2025