'ఏమి మాయ ప్రేమలోన': కేరళ బ్యాక్‌డ్రాప్‌లో స్వచ్ఛమైన ప్రేమకథ!

 'ఏమి మాయ ప్రేమలోన': కేరళ బ్యాక్‌డ్రాప్‌లో స్వచ్ఛమైన ప్రేమకథ!

అకీ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై రూపొందిన 'ఏమి మాయ ప్రేమలోన' మ్యూజికల్ ఫిల్మ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం పాటగా కాకుండా, ఒక లఘు ప్రేమకథా చిత్రంగా పది నిమిషాల నిడివితో దసరా కానుకగా యూట్యూబ్‌లో విడుదలైన ఈ ఆల్బమ్, అనూహ్యమైన స్పందనతో దూసుకుపోతోంది. ఇందులో అనిల్ ఇనుమడుగు హీరోగా నటించడమే కాక, ఈ పాటకు దర్శకత్వం వహించి, సాహిత్యం అందించడం విశేషం.

కథాంశం.. 

 కేరళలోని బ్యాక్ వాటర్స్ నేపథ్యంలో, టూరిస్టు గైడ్ కుర్రాడి (అనిల్ ఇనుమడుగు) జీవితంలోకి ఆకస్మికంగా ఓ అమ్మాయి (వేణి రావ్) వస్తుంది. ఆ మేఘాల మధ్య మెరుపులా తారసపడిన అమ్మాయి ప్రేమని గెలుచుకోవడానికి ఆ కుర్రాడు పడే తపన, వారి స్వచ్ఛమైన భావోద్వేగాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. మార్క్ ప్రశాంత్ అందించిన హృదయాన్ని తాకే సంగీతం, దిన్కర్ కలవుల, దివ్య ఐశ్వర్యల మధుర గానం పాట ఫీల్‌ని మరింత పెంచింది.

 ఓ చిన్న సినిమా అనుభూతి

'ఏమి మాయ ప్రేమలోన'కు ఇంతటి ఆదరణ రావడానికి ప్రధాన కారణం దాని అద్భుతమైన సాంకేతికత. సినిమాటోగ్రాఫర్ శ్రవణ్ కెమెరా పనితనం అసాధారణం. కేరళలోని కాయల్ , పచ్చని లోకేషన్స్‌ను ఎంతో రిచ్‌గా, చూడముచ్చటగా చూపించారు. ప్రతి ఫ్రేమ్‌ను ఒక పెయింటింగ్‌లా మలిచి, ఇది కేవలం మ్యూజిక్ ఆల్బమ్ కాదు, ఓ చిన్న సినిమాటిక్ అనుభూతిని అందించారు. లీడ్ రోల్స్‌లో నటించిన అనిల్, వేణి రావ్ జోడీ తెరపై సహజంగా, తాజాగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అజయ్, విష్ణు అకీ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ లో నిర్మించిన ఈ పది నిమిషాల మ్యూజికల్ ఫిల్మ్, యూట్యూబ్‌లో భారీ వ్యూస్‌తో ట్రెండింగ్‌లో నిలవడం, యువ ప్రతిభకు, స్వతంత్ర చిత్ర నిర్మాణానికి కొత్త ఉత్తేజాన్ని ఇచ్చింది. స్వచ్ఛమైన ప్రేమకథను, ఉన్నత సాంకేతికతతో తెరపై చూడాలనుకునేవారికి 'ఏమి మాయ ప్రేమలోన' ఒక మంచి విందు భోజనంలాంటిదంటున్నారు మేకర్స్..