కాకా వెంకటస్వామి మాట ఇస్తే తప్పరు: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

కాకా వెంకటస్వామి మాట ఇస్తే తప్పరు: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

కాకా వెంకటస్వామి స్ఫూర్తితో ఆయన అడుగుజాడల్లో నడుస్తానని అన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఆదివారం (అక్టోబర్ 05) హైదరాబాద్ రవీంద్ర భారతీలో ఏర్పాటు చేసిన కాకా 96వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన.. కాకా చేసిన పనులు, సేవ గుర్తు చేసుకుంటే స్ఫూర్తి కలుగుతుందని అన్నారు. 

2010 నుంచి 2014 వరకు కాకాతో గడిపిన సందర్భాలను గుర్తు చేసుకున్నారు. పార్లమెంట్ కు పోటీ చేసే సమయంలో పెద్దపల్లి ప్రాంతంలో తిరిగినప్పుడు ప్రతి ఒక్కరూ అడుగడుగునా కాకా ను గుర్తు చేశారని అన్నారు ఎంపీ వంశీకృష్ణ. 

కాకా మీద అభిమానంతో ప్రజలు తనను గెలిపించారు.. ఆయన బాటలోనే ప్రజలకు సేవ చేస్తానని చెప్పారు. డిల్లీలో ఎవర్ని కలిసినా తన పరిచయం కాకా పేరుతోనే మొదలవుతుందని అన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని మందుకు సాగుతానని ఈ సందర్భంగా అన్నారు. 

అంతకుముందు ట్యాంక్ బండ్ దగ్గర కాకా విగ్రహానికి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొన్నం,శ్రీధర్ బాబు,వివేక్, వాకిటి శ్రీహరి, ఎంపీ వంశీకృష్ణ,జానారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, పలువురు ప్రముఖులు నివాళి అర్పించారు.