
- సెలెక్షన్ కమిటీని నియమించిన బీజేపీ స్టేట్ చీఫ్
- 2న జయసుధతో రాంచందర్ రావు భేటీ
- ఆమెతో పోటీ చేయించేందుకేనని ప్రచారం
హైదరాబాద్: బీజేపీ జూబ్లీహిల్స్ అభ్యర్థిగా సినీనటి, మాజీ ఎమ్మెల్యే జయసుధను బరిలో దించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని తెలుస్తోంది. ఆమె గతంలో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పనిచేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమె బీజేపీలో చేరారు. ఇటీవల ఆమెతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు భేటీ అయ్యారు. ప్రత్యేకంగా ఆమె ఇంటికి వెళ్లి కలిశారు. దీంతో వీరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
ఈ స్థానం నుంచి కీర్తి రెడ్డి టికెట్ ఆశిస్తు న్నారు. వీరితో పాటు గతంలో పోటీ చేసి ఓడిపోయిన లంకల దీపక్ రెడ్డి సైతం మరోమారు బరిలోకి దిగేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ ముగ్గురిలో ఒకరిని ఫైనల్ చేసేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఒక కమిటీని వేశారు. ఈ కమిటీలో మాజీ ఎమ్మెల్యే ఎం. ధర్మా రావు, నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ పోతుగంటి రాములు, బీజేపీ సీనియర్ నాయకుడు, న్యా యవాది కోమల ఆంజనేయులు సభ్యలుగా ఉన్నారు.
స్థానిక బీజేపీ నాయకుల నుంచి అభిప్రాయాలు తీసుకోవడం, పరిస్థితులను బేరీజు వేసి పార్టీ అభ్యర్థి ఎవరైతే విజయం సాధిస్తామనే విషయాన్ని పార్టీకి ఈ త్రీమన్ కమిటీ నివేదించనుంది. కమిటీ సూచనల మేరకు టికెట్ కేటాయించే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ లో గెలుపే లక్ష్యంగా పార్టీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు స్థానిక నాయకులు, బూత్ లెవల్ కమిటీలతో సమావేశమయ్యారు. గ్రౌండ్ రియాలిటీని తెలుసుకున్నారు. అనుసరించా ల్సిన వ్యూహంపైనా చర్చించారు.
►ALSO READ | పార్కింగ్ విషయంలో గొడవ.. మాట్లాడుకుందాం అని స్టేషన్కు వచ్చి.. కత్తులు, కట్టెలతో ఇరు వర్గాల రచ్చ
జూబ్లీహిల్స్ నియోజకవర్గం, సికింద్రాబాద్ పార్లమెంటుని యోజకవర్గం పరిధిలో ఉంది. ఆయన ఎవరికి మొగ్గు చూపితే వారికే టికెట్ వస్తుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఆయన సూచన మేరకే
రాంచందర్ రావు జయసుధతో భేటీ అయినట్టు తెలుస్తోంది. పోటీ చేసేందుకు ఆ జయసుధ అంగీకరించారా..? రాంచందర్ రావు, జయసుధ మధ్య ఎలాంటి చర్చ జరిగిందనేది హాట్ టాపిక్ గా మారింది.
ఇప్పటికే బీఆర్ఎస్ ప్రచారం ప్రారంభించింది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ సతీమణి సునీత, ఆమె కూతుళ్లు, పార్టీ కార్యకర్తలు, నాయకులు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ముగ్గురు మంత్రులను ఇన్చార్జిలుగా నియమించింది. వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు నిత్యం బస్తీల్లో తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ఈ మేరకు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు కూడా చేస్తున్నారు. బీజేపీ నుంచి టికెట్ కాశిస్తున్న కీర్తి రెడ్డి, లంకల దీపక్ రెడ్డి సైతం జోరుగా ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థి ఎవరనేది తేలితే ప్రచారం మరింత ఊపందుకునే అవకాశం ఉంది.