బెడ్‌బగ్స్, దద్దుర్లు, జుట్టుతో లాగి నిర్బంధించి.. జంతువులా చూశారు..:ఇజ్రాయెల్‌పై గ్రెటా థన్‌బర్గ్ షాకింగ్ ఆరోపణలు

బెడ్‌బగ్స్, దద్దుర్లు, జుట్టుతో లాగి నిర్బంధించి.. జంతువులా చూశారు..:ఇజ్రాయెల్‌పై గ్రెటా థన్‌బర్గ్ షాకింగ్ ఆరోపణలు

ప్రఖ్యాత పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్ సహా చాల మంది మానవ హక్కుల కార్యకర్తలను ఇజ్రాయెల్ సైన్యం పట్టుకొని అదుపులోకి తీసుకుంది. దింతో గ్రెటా థన్‌బర్గ్ ఇజ్రాయెల్‌పై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. నిర్బంధంలో ఉన్నప్పుడు ఇజ్రాయెల్ సైన్యం తన పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించిందని పేర్కొంది.

ఈ విషయాన్ని గ్రెటా థన్‌బర్గ్  స్వీడిష్ అధికారులకు వెల్లడించారు. ఇజ్రాయెల్ చర్య తర్వాత ఆమె ప్రకటన వెలువడింది. గాజాకు ఆహార సామాగ్రిని తీసుకెళ్తున్న చిన్న పడవలను  ఇజ్రాయెల్ అడ్డుకుంది. ఈ పడవల్లో గ్రెటాతో సహా మరికొంతమంది మానవ హక్కుల కార్యకర్తలు ఉన్నారు.

గ్రెటా థన్‌బర్గ్ ఎం చెప్పిందంటే : ఇజ్రాయెల్ తనను బెడ్‌బగ్స్‌ ఉన్న జైలులో ఉంచిందని, నిర్బంధంలో ఉన్న సమయంలో తనకు సరిపడ ఆహారం, నీరు ఇవ్వలేదని గ్రెటా స్వీడన్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు పంపిన ఇమెయిల్‌లో రాసింది.

గ్రెటా ఇమెయిల్ గురించి సమాచారం ఇస్తూ స్వీడిష్ రాయబార కార్యాలయం "మేము గ్రెటాను కలవగలిగాము. ఆమెకి తగినంత నీరు,  ఆహారం లేకపోవడం వల్ల తాను డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నానని ఆమె చెప్పింది. బెడ్‌బగ్స్ వల్ల ఆమె శరీరం అంతటా దద్దుర్లు కూడా  ఏర్పడ్డాయని  చెప్పింది అని అన్నారు. 
 
ఇజ్రాయెల్ సైన్యం నిన్న శనివారం మరో ఇద్దరు కార్యకర్తలను కూడా విడుదల చేసింది. అలాగే వారు కూడా గ్రెటా వాదనలను నిజమే అని తేల్చి చెప్పారు. ఇజ్రాయెల్ సైనికులు ఆమెను జుట్టు పట్టుకుని లాగి ఇజ్రాయెల్ జెండాను ముద్దాడటానికి బలవంతం చేశారని కూడా  చెబుతున్నారు.

►ALSO READ | హెచ్1బీ వీసా ఫీజు పెంపుపై కేసు.. ఫెడరల్ కోర్టులో దావా వేసిన పలు యూనియన్లు

ఇశ్రాయేలు ఏమి చెప్పిందంటే : అయితే, ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ఈ  గ్రెటా చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ఖైదీలందరికీ ఆహారం, నీరు అలాగే  టాయిలెట్ సౌకర్యాలు కల్పించాము. వారికి వైద్య సంరక్షణతో సహా అన్ని చట్టపరమైన హక్కులు కూడా కల్పించాము" అని ఇజ్రాయెల్ పేర్కొంది.

గాజాకు సహాయం అందించడానికి ప్రయత్నించినందుకు ఇజ్రాయెల్ నిర్బంధించిన సుమారు 137 మంది కార్యకర్తలు 2025 అక్టోబర్ 4 శనివారం టర్కీకి చేరుకున్నారు. ఇస్తాంబుల్ విమానాశ్రయంలో దిగిన కార్యకర్తలలో 36 మంది టర్కీ పౌరులు ఉండగా... వారిలో యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అల్జీరియా, మొరాకో, ఇటలీ, కువైట్, లిబియా, మలేషియా, మౌరిటానియా, స్విట్జర్లాండ్, ట్యునీషియా, జోర్డాన్ పౌరులు కూడా ఉన్నారు.