Rakshit Shetty: ఆనందంలో రష్మిక మాజీ ప్రియుడు.. వారికి థ్యాంక్స్ చెబుతూ పోస్ట్ !

Rakshit Shetty: ఆనందంలో రష్మిక మాజీ ప్రియుడు.. వారికి థ్యాంక్స్ చెబుతూ పోస్ట్ !

తన నటన, అందంతో అభిమానులను ఉర్రూతలూగిస్తోంది రష్మిక మందన్నా.  నేషనల్ క్రష్ గా గుర్తింపును సొంతం చేసుకున్న ఈ బ్యూటీ  సినిమాల్లోనే కాదు ప్రేమ వ్యవహారాల్లో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తోంది. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ఆమె ప్రేమాయణం బహిరంగ రహస్యమే. లేటెస్ట్ గా వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారని బయటకి పొక్కింది. కానీ దీనిపై ఇద్దరు నుంచి ఎలాంటి ప్రకటన లేదు. త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అయితే పెద్దగా హడావిడి లేకుండానే పెళ్లి పనులు కానిచ్చేస్తున్న సమాచారం. దీంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా విజయ్, రష్మికల పెళ్లి గురించే టాక్ నడుస్తోంది.  

అయితే ఇది రష్మికకు రెండో ఎంగేజ్ మెంట్.  తన తొలి సినిమాతోనే హీరో రక్షిత్ శెట్టితో ప్రేమలో పడిన రష్మిక, పెద్దలను ఒప్పించి 2017 జూలై 3న అంగరంగ వైభవంగా నిశ్చితార్థం చేసుకుంది. పెళ్లి పీటలు ఎక్కడానికి ముందే ఈ జంట తమ బంధానికి ముగింపు పలికి, విడిపోయినట్లు ప్రకటించింది. అయితే రష్మిక నిశ్చితార్థం సమయంలోనే తన మాజీ ప్రియడు రక్షిత్ శెట్టి గుడ్ న్యూస్ అందుకున్నారు.  

రక్షిత్ శెట్టికి అరుదైన గౌరవం

రక్షిత్ శెట్టి  '777 చార్లీ', 'సప్త సాగరాలు దాటి సైడ్ A', 'సైడ్ B' వంటి విలక్షణ చిత్రాలతో ఘన విజయాలు అందుకున్నారు. లేటెస్ట్ గా రక్షిత్ శెట్టికి కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డుల్లో అరుదైన గౌరవం దక్కింది. సెన్సార్ అయిన సినిమాలకు ప్రకటించిన రాష్ట్ర చలనచిత్ర అవార్డుల్లో, '777 చార్లీ' సినిమా ఏకంగా నాలుగు పురస్కారాలను ప్రకటించింది. ఉత్తమ రెండో చిత్రంగా నిలవడంతో పాటు, ఈ చిత్రానికిగానూ రక్షిత్ శెట్టి ఉత్తమ నటుడుగా అవార్డును అందుకున్నారు. 

మనసు ఆనందంతో ఉప్పొంగుతోంది.. 

ఈ అరుదైన విజయంపై రక్షిత్ శెట్టి తన ఆనందాన్ని పంచుకుంటూ ట్వీట్ చేశాడు. "777 చార్లీ సినిమాకు 4 అవార్డులు.. మనసు ఆనందంతో ఉప్పొంగుతోంది. దర్శకుడు కిరణ్ రాజ్ విజన్, ప్రతీక్ అద్భుతమైన ఎడిటింగ్, నాగార్జున చేతినుంచి జారిపడ్డ అందమైన మాటలు అందరి హృదయాలను తాకాయి" అంటూ చిత్ర బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. మాజీ ప్రియురాలి కెరీర్ ఉన్నత శిఖరాల్లో ఉండగా, రక్షిత్ శెట్టికి లభించిన ఈ గౌరవం ఆయన అభిమానులకు మరింత సంతోషాన్ని ఇచ్చింది.   జ్యూరీకి, ప్రేక్షకులకు, చిత్రయూనిట్‌కు ధన్యవాదాలు. దర్శకుడు కిరణ్‌ రాజ్‌ విజన్‌.. ప్రతీక్‌ అద్భుతమైన ఎడిటింగ్‌, నాగార్జున చేతినుంచి జారిపడ్డ అందమైన మాటలు అందరి హృదయాలను తాకాయి' అంటూ ఈ ముగ్గురికి స్పెషల్‌ థాంక్స్‌ చెప్తూ ట్వీట్‌ చేశాడు.  ఈ సంతోషాన్ని తన ఫ్రెండ్స్ , ఫ్యాన్స్ తో పంచుకుంటూ రక్షిత్ శెట్టి సంబరాలు చేసుకుంటున్నారు.

 

రక్షిత్‌తో బ్రేకప్ తర్వాత విజయ్ తో ప్రేమ ప్రయాణం..

రక్షిత్‌తో బ్రేకప్ తర్వాత రష్మిక కెరీర్ పై పూర్తిగా దృష్టి పెట్టింది. 2018లో 'గీత గోవిందం' సినిమా ద్వారా తొలిసారి విజయ్ దేవరకొండతో జోడీ కట్టింది. ఈ చిత్రం నుంచే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందనే ప్రచారం మొదలైంది. మొదట్లో కేవలం స్నేహితులం అని చెప్పినా, తర్వాత ఆ రూమర్సే నిజమయ్యాయి. రక్షిత్ శెట్టి ఒకప్పుడు రష్మిక కలలు చాలా పెద్దవి అని చెప్పినట్లుగానే, ఆమె కేవలం దక్షిణాదికే పరిమితం కాకుండా, 'పుష్ప' వంటి సినిమాలతో పాన్ ఇండియా సెన్సేషన్ గా మారి, తన లక్ష్యాలను చేరుకుంది. లేటెస్ట్ గా విజయ్, రష్మిక నిశ్చితార్థం రహస్యం జరిగిందని సినీ వర్గాల నుంచి సమాచారం. త్వరలోనే ఈ జంట కొత్త జీవితంలోకి అడుగుపెట్టనున్నారు.

►ALSO READ | Rachita Ram: లేడీ డాన్‌గా రచిత రామ్! మాస్ ఎమోషనల్ థ్రిల్లర్ 'కల్ట్‌'లో రచ్చ !