
కన్నడ సినీ ఇండస్ట్రీలో తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి రచితరామ్. ఇటీవల రజనీకాంత్ హీరోగా నటించిన 'కూలీ' చిత్రంలో లేడీ విలన్ పాత్రలో నటించి మెప్పించింది . ఇప్పుడు ఈ బ్యూటీ తన నెక్స్ట్ ఫిల్మ్ 'కల్ట్'తో మరోసారి ప్రేక్షకులను ఆశ్చర్యపరచడానికి సిద్ధమైంది. రచిత రామ్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన ఈ మూవీ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
షాకింగ్ లుక్‌తో 'కల్ట్' పోస్టర్
'కల్ట్: బ్లడీ లవ్' అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ రొమాంటిక్ థ్రిల్లర్ పోస్టర్‌ను చూస్తే, ఈసారి రచిత రామ్ మాస్ రోల్‌లో విశ్వరూపం చూపించబోతున్నారని స్పష్టమవుతోంది. ఈ పోస్టర్‌లో రచిత రామ్ ఏకంగా లేడీ డాన్ లుక్‌లో కనిపిస్తోంది. టాయిలెట్ సీటుపై కూర్చొని, స్టైల్‌గా సిగరెట్ తాగుతూ ఉన్న ఆమె మాస్ అవతార్ అందరి దృష్టిని ఆకర్షించింది. పక్కనే గిటార్ కాలిపోతూ ఉండటం, వెనుక ఒక వ్యక్తి బాధతో చూస్తున్న ఫొటో ఈ కథలోని తీవ్రతను సూచిస్తున్నాయి. "నీ జ్ఞాపకాలను ఫ్లష్ చేసి తుడిచి పెట్టలేను" అనే పవర్‌ఫుల్ డైలాగ్ పోస్టర్‌కు మరింత ఆసక్తిని పెంచింది.
ప్రేమ వైఫల్యం తర్వాత కథ
దర్శకుడు అనిల్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రచిత రామ్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా, యువ నటుడు జైద్ ఖాన్ ఆమెకు జోడీగా కనిపించనున్నారు. ఈ చిత్ర కథాంశం ఆసక్తికరంగా ఉంది. కథలో రచిత రామ్ లవ్ ఫెయిల్యూర్ అయిన యువతిగా కనిపిస్తుంది. ఒక గాఢమైన ప్రేమలో విఫలమైన తర్వాత ఆమె జీవితం ఎలాంటి అనూహ్యమైన మలుపులు తిరిగింది, ఆ తర్వాత ఆమె లేడీ డాన్‌గా ఎలా మారింది అనే అంశాల చుట్టూ ఈ రొమాంటిక్ థ్రిల్లర్ అల్లుకుందని తెలుస్తోంది. రచిత రామ్ తన కెరీర్‌లో ఈ విధంగా విభిన్నమైన, సాహసోపేతమైన పాత్రలను ఎంచుకుంటూ ఉండటం సినీ విమర్శకులను కూడా ఆకట్టుకుంటోంది.
ALSO READ : భారతీయ సినిమాలపై పుతిన్ ప్రేమ..
ఈ మాస్ ఎమోషనల్ థ్రిల్లర్ వచ్చే ఏడాది జనవరి 23న తెలుగులో కూడా విడుదల కానుంది. రచిత రామ్ నుంచి మరో పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌ను చూడాలని సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Unveiling the motion poster of Cult!
— Rachita Ram (@RachitaRamDQ) October 3, 2025
Releasing on jan 23.01.2026 pic.twitter.com/ZWRXTA0uS3