అన్ని శక్తులు ఏకమై కేసీఆర్​ను గద్దెదించాలి : ప్రొఫెసర్ కోదండరాం

అన్ని శక్తులు ఏకమై కేసీఆర్​ను గద్దెదించాలి :  ప్రొఫెసర్ కోదండరాం

నిజామాబాద్ సిటీ, వెలుగు: అన్ని శక్తులు ఏకమై కేసీఆర్​ను గద్దెదించాలని టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. నిజామాబాద్ అర్బన్​లో తెలంగాణ జన సమితి నుంచి జాఫర్ ​నామినేషన్ వేయగా, మంగళవారం ఉపసంహరించుకున్నారు. తర్వాత ఏర్పాటు చేసిన సమావేశంలో కోదండరాం పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచిన షబ్బీర్ అలీకి మద్దతుగా, ఓట్లు చీలొద్దనే ఉద్దేశంతో నామినేషన్ ఉపసంహరించుకున్నట్లు చెప్పారు. 

కేసీఆర్​ విచ్చలవిడిగా లిక్కర్​ను అందుబాటులో ఉంచి యువతను తాగుబోతులను చేశాడన్నారు. కాళేశ్వరం, మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణాల్లో కోట్ల అవినీతి జరిగిందన్నారు. మళ్లీ కేసీఆర్ ని గెలిపిస్తే రాష్ట్రం కోలుకోవడం కష్టమవుతుందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీ మాట్లాడుతూ తనకు మద్దతుగా తెలంగాణ జన సమితి పార్టీ నుంచి నామినేషన్ ఉపసంహరించుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.