ప్రొఫెసర్ కోదండరామ్​కు అస్వస్థత

 ప్రొఫెసర్  కోదండరామ్​కు అస్వస్థత

హైదరాబాద్, వెలుగు :  టీజేఎస్ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరామ్ డీ హైడ్రేషన్​కు గురయ్యారు. ఐదు రోజులుగా ఆయన తార్నాకలోని తన నివాసంలోనే రెస్ట్ తీసుకుంటున్నారు. వారం నుంచి పార్టీ ఆఫీసుకు, విజటర్స్​కు, వివిధ పోగ్రాంలకు కోదండరామ్​ దూరంగా ఉంటున్నారు. ఇటీవల హాస్పిటల్​కు వెళ్లి టెస్ట్​లు చేయించుకున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం కోదండరామ్ ఆరోగ్యం మెరుగైందని.. త్వరలోనే పార్టీ ఆఫీస్​కు వస్తారని పేర్కొన్నారు.