కాళేశ్వరం కాంట్రాక్టర్ల జేబులు నింపే ప్రాజెక్ట్ : కోదండరామ్

కాళేశ్వరం కాంట్రాక్టర్ల జేబులు నింపే ప్రాజెక్ట్ : కోదండరామ్

తొమ్మిదిన్నర సంవత్సరాల్లో తెలంగాణ ప్రభుత్వం లక్ష కోట్లు ఇరిగేషన్ పై ఖర్చుపెట్టినా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉందన్నారు జనసమితి పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్. కాళేశ్వరం కాంట్రాక్టర్ల జేబులు నింపే ప్రాజెక్ట్ అయ్యిందన్నారు. ఈ ప్రాజెక్టులో రూ.25 వేల కోట్లు గల్లంతయ్యాయని ఆరోపించారు.  మూడు బ్యారేజీలు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ పనికిరాకుండా పోయాయని చెప్పారు. గౌరవెల్లి ప్రాజెక్ట్ కట్టినప్పుడు గ్రామస్తుల దగ్గర తక్కువ డబ్బులకే భూములు గుంజుకున్నారని చెప్పారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో జనసమితి పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ మీడియా సమావేశం నిర్వహించారు. 

కేసీఆర్ మళ్లీ గెలిస్తే చిప్ప చేతికి వస్తుందన్నారు. తెలంగాణను సరి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని, అందుకే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామిక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడాలని, కాంగ్రెస్ కు జేఏసీ పక్షాన కొన్ని డిమాండ్లతో సంపూర్ణ మద్దతు తెలిపామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎలా కొట్టుకుపోతుందో ఈ గవర్నమెంట్ కూడా అలాగే కొట్టుకుపోతుందని చెప్పారు. 

ALSO  READ : బీజేపీ నేతృత్వంలో హంగ్ ప్రభుత్వం వస్తుంది: ధర్మపురి అరవింద్