ఉద్యోగులూ ఇక ధైర్యంగా .. నార్మాల్ కాల్ మాట్లాడొచ్చు

ఉద్యోగులూ ఇక ధైర్యంగా .. నార్మాల్ కాల్ మాట్లాడొచ్చు

హైదరాబాద్‌: సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి ముందే సచివాలయం దగ్గర సందడి వాతావరణం నెలకొన్నది. టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అక్కడకు చేరుకుని ఉద్యోగులతో ముచ్చటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇంతకాలం ఒక కుటుంబం చేతుల్లో బందీగా ఉన్న పరిపాలనకు ఇప్పుడు విముక్తి లభించిందన్నారు. ప్రజలు కోరుకున్న ప్రజాస్వామిక తెలంగాణ ఇప్పుడు ఏర్పడబోతున్నదన్న అభిప్రాయం ఉద్యోగుల్లో, ప్రజల్లో కనిపిస్తున్నదన్నారు. ఇకపైన ప్రజల తెలంగాణ వస్తుందనే ధీమాను వ్యక్తం చేశారు. ఇంతకాలం ఉద్యోగులు వాట్సాప్ కాల్‌‌లో మాట్లాడుకునేవారని, ఇప్పుడు మామూలు ఫోన్లలోనే మాట్లాడుకునే వాతావరణం ఏర్పడిందని, ఫోన్ సంభాషణల మీద నిఘా పోయిందన్నారు. 

పొడుస్తున్న పొద్దుమీద

సచివాలయంలో సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. ఉద్యోగులు నృత్యాలు చేస్తూ ఉత్సవాలు జరుపుకొంటున్నారు. ప్రజా యుద్ధనౌక గద్దర్ పాట ‘ పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా.. వీర తెలంగాణమా.. వీర తెలంగాణమా.. కోట్లాది ప్రాణమా..! ’అనే సాంగ్ ప్లే చేస్తూ.. డ్యాన్సులు చేస్తున్నారు.