ఓయూ, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీ 29వ వైస్‌చాన్స్‌లర్‌గా ప్రొఫెసర్ కుమార్శనివారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఓయూ పరిపాలనా భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వర్సిటీ ప్రతిష్టను మరింతగా పెంచేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. తనకు అవకాశం ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు. వర్సిటీలో ప్రశాంతమైన పరిస్థితులను తీసుకురావాలన్నదే తన లక్ష్యమన్నారు. వర్సిటీ నాక్ అక్రిడిటేషన్ గుర్తింపు అయిపోయిందని, వెనువెంటనే ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పారు. టీచింగ్, నాన్-టీచింగ్స్టాఫ్సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామన్నారు.
అగ్రికల్చర్ వర్సిటీ వీసీగా అల్దాస్ జానయ్య
గండిపేట: రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్అగ్రికల్చర్యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య శనివారం బాధ్యతలు చేపట్టారు. ఇన్చార్జ్వీసీగా ఉన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్సెక్రటరీ ఎం.రఘునందనరావు అల్దాస్జానయ్యకు బాధ్యతలు అప్పగించారు.