ఐపీఈ డైరెక్టర్ గా ప్రొఫెసర్ లింబాద్రి

ఐపీఈ డైరెక్టర్ గా ప్రొఫెసర్ లింబాద్రి

హైదరాబాద్, వెలుగు: ఇన్‌‌‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌‌‌‌ప్రైజ్ (ఐపీఈ) డైరెక్టర్‌‌‌‌గా ప్రొఫెసర్ లింబాద్రి నియమితులయ్యారు. శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం హైదరాబాద్‌‌‌‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విద్యాసంస్థల సీఈవోగా పనిచేస్తున్నారు. కాగా, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల సమస్యల పరిష్కార కమిటీ (గ్రీవెన్స్ రెడ్రెస్సల్) అంబుడ్స్‌‌‌‌పర్సన్‌‌‌‌గా కొనసాగుతున్నారు. 

విద్యా రంగంతో పాటు పాలనా విభాగంలో ఆయనకున్న అపార అనుభవం ఐపీఈ సంస్థాగత అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని మేనేజ్‌‌‌‌మెంట్ ప్రకటించింది. 
ఫొటో: వెలుగు పిక్స్ గ్రూపులో లింబాద్రి పేరుతో ఉంటుంది.