
- మిహికా గురించి విషయాలు మీ కోసం
- ఒక్కసారిగా పెరిగిపోయిన ఫాలోయింగ్
హైదరాబాద్: టాలీవుడ్ కుర్ర హీరోల్లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్‌లో ఒకరైనా రానా త్వరలో పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అయ్యారనే విషయం స్వయంగా ఆయన ప్రకటించారు. ఈ మేరకు తన ప్రేమ విషయం గురించి స్వయంగా సోషల్ మీడియాల పోస్ట్ కూడా చేశారు. ‘ఆమె ఎస్ చెప్పింది’ అంటూ ప్రియురాలు మిహికా బజాజ్‌తో ఉన్న ఫొటోను పోస్ట్ చేసి ఆమెను అందరికీ పరిచయం చేశారు. రానా ఇలా పోస్ట్ పెట్టాడో లేదో.. అందరి మదిలో ఒకటే డౌట్.. ఎవరూ ఈ మిహికా అని. ఇంకేముంది దగ్గుబాటి అభిమానులంతా మిహికా గురించి గూగుల్‌లో వెతకడం మొదలుపెట్టారు. ఆమె వివరాలు మీ కోసం.
పక్కా హైదరాబాదీ
హైదరాబాద్‌కు చెందిన మిహికా ముంబైలో ఇంటీరియర్ డిజైనింగ్‌లో డిప్లొమా చేసి ఇంటియర్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. డ్యూ డ్రాప్ పేరుతో ఒక ఈవెంట్ మేనేజ్‌మెంట్ అండ్ డెకార్ కంపెనీనీ నిర్వహిస్తున్నారు. లండన్‌లోని చెల్సీ యూనివర్సీటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ డిజైన్‌లో ఏంఏ చేశారు. మహిక తండ్రి పేరు సురేశ్, తల్లి బంటియా బజాజ్ జ్యుయెలరీ డిజైనర్. ఆమె మన దేశంలోనే టాప్ వెడ్డింగ్ ప్లానర్స్‌లో ఒకరిగా పేరు ఉంది. మిహిక అన్న ప్రముఖ డిజైనర్ కునాల్ రావల్ సోదరి శాషాను పెళ్లి చేసుకున్నారు.
ప్రముఖ బాలీవుడ్ నటులు చాలా మంది మిహిక ఫ్యామిలీకి ఫ్రెండ్స్ అని తెలుస్తోంది. రానా మిహిక రిలేషన్ గురించి బయటకు వచ్చిన వెంటనే చాలా మంది సెలబ్రిటీలు ఆమెకు విషెష్ చెప్పారు. అంతే కాకుండా సోనమ్ కపూర్, సాగరికా ఘటే, కైరా అద్వాణీ, మాసబ్ గుప్తా తదితరులు కూడా మెహికకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్రెండ్స్. ప్రముఖ హీరోయిన్ల ద్వారానే మిహిక రానాకు పరిచయం అయినట్లు తెలస్తోంది.
ఒక్కసారిగా పెరిగిన ఫాలోయింగ్
మిహిక గురించి రివీల్ చేసిన వెంటనే ఆమెకు ఒక్కసారిగా ఆమెకు ఫాలోయింగ్ పెరిగిపోయింది. ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోయర్స్ ఒక్కసారిగా పెరిగిపోయారు. అంతే కాకుండా సోషల్ మీడియా వేదికగా టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు చాలా మంది రానా, మిహికాకు కంగ్రాట్స్ చెప్పారు. చిరంజీవి, రామ్‌చరణ్, అనుష్క, తమన్నా, అటు బాలీవుడ్ ప్రముఖులు సోనమ్ కపూర్ తదితరులు ఆమెకు విషెస్ చెప్పారు.
Congratulations my Boy @RanaDaggubati Finally the mighty #BhallalaDeva is struck by #Cupid & Getting hitched. #Lockdown leads to #WedLock. God Bless You Both! శతమానం భవతి. @MiheekaBajaj pic.twitter.com/fDdHbjhivz
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 12, 2020