మరోసారి లాభాలొచ్చాయ్! సెన్సెక్స్ 410 పాయింట్లు అప్.. 135.45 పాయింట్లు పెరిగిన నిఫ్టీ

మరోసారి లాభాలొచ్చాయ్! సెన్సెక్స్ 410 పాయింట్లు అప్.. 135.45 పాయింట్లు పెరిగిన నిఫ్టీ

ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం (సెప్టెంబర్ 03) లాభాలతో ముగిశాయి. మెటల్ షేర్లలో రాలీ, జీఎస్టీ కౌన్సిల్ సమావేశంపై ఆశావాదం మార్కెట్లకు ఊతమిచ్చాయి. మొదట్లో నష్టాల్లో ఉన్నప్పటికీ, తర్వాత సెన్సెక్స్ 409.83 పాయింట్లు పెరిగి 80,567.71 వద్ద ముగిసింది.  ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 135.45 పాయింట్లు లాభపడి 24,715.05 వద్ద స్థిరపడింది. 

సెన్సెక్స్​లో టాటా స్టీల్ షేరు 5.90 శాతం లాభపడి టాప్​గెయినర్​గా నిలిచింది. టైటాన్, మహీంద్రా అండ్​ మహీంద్రా, ఐటీసీ, ఎటర్నల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ట్రెంట్ లాభపడ్డాయి.  ఇన్ఫోసిస్, ఎన్​టీపీసీ, హిందుస్థాన్ యూనిలివర్, టీసీఎస్, అదానీ పోర్ట్స్, భారతీ ఎయిర్​టెల్ షేర్లు నష్టపోయాయి. జీఎస్టీ కౌన్సిల్ రెండు రోజుల సమావేశంలో జీఎస్టీ రేట్లను 5 శాతం, 18 శాతానికి తగ్గించే అంశంపై చర్చించనుంది. ఈ విషయం మార్కెట్లలో సానుకూల సెంటిమెంట్‌‌‌‌కు దారితీసింది. 

బీఎస్​ఈ స్మాల్​క్యాప్ సూచీ 0.90 శాతం, మిడ్​క్యాప్ సూచీ 0.63 శాతం లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా కోస్పి లాభాలతో ముగియగా, జపాన్ నిక్కీ 225 సూచీ, షాంఘై ఎస్ఎస్ఈ కాంపోజిట్ సూచీ, హాంకాంగ్ హాంగ్ సెంగ్ నష్టాలతో ముగిశాయి. యూరప్​ ఈక్విటీ మార్కెట్లు లాభాలతో ట్రేడయ్యాయి. 

మంగళవారం యూఎస్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్​ఐఐలు) మంగళవారం రూ. 1,159.48 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు. అంతర్జాతీయ చమురు బెంచ్​మార్క్ బ్రెంట్ క్రూడ్ ధర 1.52 శాతం తగ్గి బ్యారెల్​ధర 68.09 డాలర్ల వద్ద ఉంది.