
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ లోని భోజ్ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ ఫర్ వుమెన్ లో జెనరేటివ్ ఏఐ, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ పై ఏఐసీటీఈ ట్రైనింగ్ అండ్ లెర్నింగ్ (ఏటీఏఎల్) ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఘనంగా జరిగింది.
సోమవారం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఏఐసీటీఈ జాతీయ ఆవిష్కరణలో భాగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై అధ్యాపకుల్లో నైపుణ్యం పెంచేందుకు ఈ ఆరు రోజుల ప్రోగ్రామ్ ను చేపట్టారు. ప్రోగ్రామ్ ను కాలేజీ ప్రిన్సిపాల్ డా. జి. శ్యామ చంద్ర ప్రసాద్ అధికారికంగా ప్రారంభించి ప్రసంగించారు. ఎడ్యుకేషన్, పరిశ్రమలు, సమాజంపై ఏఐ చూపుతున్న ప్రభావాన్ని వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సన అఫ్రీన్.. సాంకేతిక విద్య, పరిశోధన, ఆవిష్కరణలపై ఏఐ చూపిస్తున్న ప్రభావంపై మాట్లాడారు.