కోస్తా తీరంలో చేపల వేట నిషేధం

కోస్తా తీరంలో చేపల వేట నిషేధం

విశాఖపట్టణం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కోస్తా తీరంలో బలమైన గాలులు వీస్తున్నాయి. మరో ఐదారు రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపధ్యంలో అధికారులు ఈనెల  28వ తారీకు వరకు మత్స్యకారులు చేపల వేట నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు తీర ప్రాంతాల్లోని అన్ని గ్రామాలకు సందేశాలు పంపి అప్రమత్తం చేస్తున్నారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కోస్తా తీరం వెంబడి గంటలకు  45 నుండి 55 మేర ఓ మోస్తరు నుండి బలమైన గాలులు వీచే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం నిన్ననే ప్రకటన విడుదల చేసింది. ఈనెల 25, 26 తారీకులలో కోస్తాంధ్ర నుండి యానం తీరం వరకు బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.