ప్రాజెక్ట్-K కామిక్ కాన్ ఈవెంట్ లో..స్పెషల్ రైడర్లు

 ప్రాజెక్ట్-K కామిక్ కాన్ ఈవెంట్ లో..స్పెషల్ రైడర్లు

ఇండియా స్టార్ ప్రభాస్( Prabhas) హీరోగా భారీ స్థాయిలో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ 'ప్రాజెక్ట్ K'. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ పై ప్రపంచ వ్యాప్తంగా భారీ ఆశలున్నాయి. 

జూలై 19న రిలీజ్ చేసిన ప్రభాస్ ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ ను ఆకట్టుకోగా..ఇప్పుడు ప్రాజెక్ట్ K అంటే ఏంటో తెలుసుకోవాలని అందరు వెయిట్ చేస్తున్నారు. నేడు(జూలై 20) న అమెరికాలోని ప్రఖ్యాత శాన్ డీగో కామిక్ కాన్ ఈవెంట్ కు వెళ్లిన మూవీ టీమ్.. టైటిల్..ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారు. దీంతో అమెరికాలో కామిక్ కాన్ ఈవెంట్ సందడి స్టార్ట్ అయింది..కామిక్ కాన్ ఈవెంట్లో ప్రాజెక్ట్  K మూవీ ప్రమోషన్స్  కూడా విభిన్న రీతిలో కొనసాగుతున్నాయి.

తాజాగా కామిక్ కాన్ ఈవెంట్లో హాలీవుడ్ మూవీలో ఉండే రైడర్స్ కనిపించారు. ఈ రైడర్స్ అంతా.. తమ మార్క్ గెటవ్.. బ్లాక్ సూట్ వేసుకుని... కామిక్ కాన్ ఈవెంట్లో సినిమాను ప్రమోట్ చేస్తున్నారు..ఈ ఈవెంట్ లో కనిపించే వీరి గేటప్స్ లానే ప్రాజెక్ట్ K లో విలన్స్ ఉంటారని ఇంతకు ముందే టాక్ వినిపించింది. ఇప్పుడు ఈవెంట్ ముందు దర్శనం ఇచ్చే సరికి ఫ్యాన్స్ అంతా వారితో సెల్ఫీ తీసుకోవడం స్టార్ట్ చేశారు..దీంతో కామికన్ ఈవెంట్  సందడిగా మారింది. 'O'రైడర్స్ అంతా Now Begins The End అంటూ బ్యానర్స్ పట్టుకొని ఈవెంట్ దగ్గర హడావిడి చేస్తున్నారు. 

మరి కొన్ని గంటల్లో విడుదల కానున్న ప్రాజెక్ట్ K టైటిల్, గ్లింప్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.