
భారత వాయుసేన పైలెట్, వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌కు తాజాగా పదోన్నతి లభించింది. కమాండర్ నుంచి గ్రూప్ కెప్టెన్‌గా నియమిస్తూ భారత వాయుసేన ఉత్తర్వులు జారీ చేసింది. బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన దాడుల తర్వాత.. భారత్, పాక్ మధ్య జరిగిన ఘర్షణలో అభినందన్ ధైర్యసాహసాలు చూపించారు. ఈ క్రమంలోనే అభినందన్‌కు పదోన్నతి దక్కింది. పాక్ వైమానికదళంతో వీరోచితంగా పోరాడినందుకుగానూ అభినందన్‌ను భారత ప్రభుత్వం 2019లోనే వీర్ చక్ర అవార్డుతో సత్కరించింది. తాజాగా అభినందన్‌కు గ్రూప్ కెప్టెన్ ర్యాంక్ దక్కనుంది. ఈ పదవి సైనికదళంలో కల్నల్ ర్యాంక్‌తో సమానం.