న్యూఢిల్లీ: ప్రాపర్టీ షేర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌కు చెందిన ప్రాప్షేర్ సెలెసియా ఐపీఓ వచ్చే నెల 10–16 తేదీల్లో జరుగుతుంది. దీనిద్వారా కంపెనీ రూ.244.65 కోట్లను సమీకరిస్తుంది. ఒక్కో యూనిట్ ధరను రూ.10 లక్షల నుంచి రూ.10.50 లక్షలుగా నిర్ణయించారు. ఇది దేశంలోనే మొదటి రిజిస్టర్డ్ ఎస్ఎం రీట్‌గా నిలవనుంది.
ఈ నిధులతో అహ్మదాబాద్‌లోని వీనస్ స్ట్రాటమ్ భవనంలో ఏడు అంతస్తులను కొనుగోలు చేస్తారు. కనీస పెట్టుబడి రూ.10 లక్షలు. ఇందులో స్మార్ట్‌వర్క్స్, ఈఎఫ్‌సీ లిమిటెడ్ వంటి సంస్థలు అద్దెకు ఉన్నాయి. యూనిట్లను బీఎస్ఈలో లిస్ట్ చేయనున్నారు.
