తెలంగాణ పబ్లికేషన్ స్టాల్ ఎందుకు పెట్టలే?

తెలంగాణ పబ్లికేషన్ స్టాల్ ఎందుకు పెట్టలే?

ముషీరాబాద్, వెలుగు: హైదరాబాద్ బుక్ ఫెయిర్ నిర్వాహకులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఎదుట కోయ చంద్రమోహన్ అనే వ్యక్తి శుక్రవారం ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ పబ్లికేషన్స్ కు స్టాల్ ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. వెంటనే స్టాల్​ కేటాయించాలని డిమాండ్​ చేశారు. దోమలగూడ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తీసుకెళ్లారు.