- ఆందోళనతో దిగొచ్చిన కాలేజీ యాజమాన్యం
ఘట్కేసర్, వెలుగు: మేడ్చల్ జిల్లా నారపల్లిలోని నల్ల మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ ఎదుట హిందూ సంఘాలు, అయ్యప్ప భక్తులు శనివారం ఆందోళనకు దిగారు. అయ్యప్ప మాల వేసుకున్న విద్యార్థితో బలవంతంగా మాల దుస్తులు తీయించి అధ్యాపకులు యూనిఫామ్ వేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ మనోభావాలను దెబ్బతీసిన కాలేజీ యాజమాన్యం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు.
అయినా వెనక్కి తగ్గకపోవడంతో చివరకు కాలేజీ యాజమాన్యం క్షమాపణ చెప్పడంతో నిరసన విరమించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఏనుగు సుదర్శన్ రెడ్డి, బండారి పవన్ రెడ్డితోపాటు బాలేశ్, జైపాల్ రెడ్డి, అయ్యప్ప మాలధారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
