ఏటూరునాగారం ఐటీడీఏ ఎదుట ఉద్రిక్తత

ఏటూరునాగారం ఐటీడీఏ ఎదుట ఉద్రిక్తత

ములుగు జిల్లాలోని ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయం ఎదుట ఉద్రిక్త  పరిస్థితి నెలకొంది. మరికొద్ది సేపట్లో రామన్న గూడెం నుంచి ఐటీడీఏ కార్యాలయంలో జరిగే సమీక్షా సమావేశానికి సీఎం కేసీఆర్ హాజరవనుండగా.. ఐటీడీఏ మెయిన్ గేట్ ఎదుట వరద నిర్వాసితులు ఆందోళనకు దిగారు. ‘‘ సర్వం కోల్పోయాం.. మమ్మల్ని ఆదుకోండి. సీఎంకు మా గోడు చెప్పుకునే అవకాశం ఇవ్వండి’’ అంటూ  నినాదాలు చేశారు. ‘‘మేం ఏటూరునాగారం మండల కేంద్రంలోని బెస్తగూడెం, ఎస్సీ కాలనీ, శివాలయ వీధి ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చాం. వర్షాలకు మా ఇండ్లు మునిగిపోయాయి. ఇండ్లలోకి నీరు చేరి బియ్యం, బట్టలు తదితర సామగ్రి కరాబయ్యాయి. మాకు ఆర్థిక సహాయం అందించాలి’’ అని వారు డిమాండ్ చేశారు. వారిని పోలీసులు అడ్డుకొని ఆందోళన విరమింపజేశారు.