ఇబ్రహీంపట్నం, వెలుగు: గ్రామకంఠం భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీ చీఫ్విశారదన్ మహరాజ్ డిమాండ్చేశారు. సోమవారం ఇబ్రహీంపట్నం మండలంలోని దండుమైలారంలో గ్రామస్తులతో కలిసి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దండుమైలారంలోని నాలుగున్నర ఎకరాల భూమి గ్రామ పంచాయతీదేనన్నారు.
మాజీ సర్పంచ్ఆధీనంలో ఉన్న ఈ భూమి జీపీకే చెందాలని, అప్పటివరకు పోరాటం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్నరేశ్, స్థానిక పలువురు నాయకులు పాల్గొన్నారు.
