ఉస్మానియా ఆస్పత్రి ఎదుట వైద్య సిబ్బంది ఆందోళన

ఉస్మానియా ఆస్పత్రి ఎదుట వైద్య సిబ్బంది ఆందోళన

హైద‌రాబాద్: త‌మ‌కు నాలుగు నెలలుగా ఇవ్వాల్సిన జీతాలు వెంటనే చెల్లించాలంటూ ఉస్మానియా ఆసుపత్రి కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు బుధవారం ధర్నాకు దిగారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమకు జీతాలు పెంచి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ తమ ప్రాణాలను ఫణంగా పెట్టి వార్డుల్లో విధులు నిర్వహిస్తున్నామని చెప్పారు. అయినా, అధికారులు తమకు జీతాలు ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పని ఒత్తిడి ఉన్నా తమ ఉద్యోగ బాధ్యతను నిర్వర్తిస్తున్నామని, ఎక్కువ పని గంటలు కూడా పని చేస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, గాంధీ ఆసుపత్రిలో ఒప్పంద కార్మికులు, సిబ్బందికి జీతాలు పెంచినట్లే తమకు కూడా పెంచాలని కోరారు.

protest in front of Osmania Hospital that outsourcing Medical staff demanding pay hike