సిరిసిల్ల పర్యటనలో కేటీఆర్ కి నిరసన సెగ

సిరిసిల్ల పర్యటనలో కేటీఆర్ కి నిరసన సెగ

రాజన్న సిరిసిల్ల పర్యటనలో మంత్రి  కేటీఆర్‌కి  నిరసన సెగ  తగిలింది. ఫ్లకార్డులతో  నిరసన తెలిపేందుకు యత్నించిన  నేరళ్ల బాధితుడు  కోల హరీష్ ని పోలీసులు అదుపులోకి  తీసుకున్నారు. దీంతో కోల  హరీష్  ఇంటి  ముందు పోలీస్ భారీ  బందోబస్తు ఏర్పాటు చేశారు.  నేరెళ్ల ఘటన  జరిగి ఐదేళ్లు దాటినా   దళితులకు న్యాయం  జరగలేదన్నారు హరీశ్.  నేరెళ్ల  బాధితులపై తప్పుడు కేసులు  పెట్టారని  మండిపడ్డారు.  నేరెళ్ల బాధితులకు  థర్డ్ డిగ్రీ చేసిన పోలీసులపై  ఎందుకు చర్యలు  తీసుకోవడం  లేదని హరీశ్ ప్రశ్నించారు.

రాజన్న సిరిసిల్ల  పట్టణంలో పర్యటిస్తున్నారు  మంత్రి కేటీఆర్. కేడీసీసీ  బ్యాంక్, రెడ్డి సంక్షేమ సంఘ భవనాన్ని  కేసీఆర్ ప్రారంభించారు.  తర్వాత  అటవీ భూముల  సమస్యపై  కలెక్టరేట్ లో అధికారులతో  KTR రివ్యూ  నిర్వహించారు. తొమ్మిది  రాజకీయ పార్టీలతో  అవగాహన సదస్సు కొనసాగుతోంది.