తెలంగాణకు వరద సాయం అందించండి

తెలంగాణకు వరద సాయం అందించండి

కేంద్రానికి ఆలిండియా  కిసాన్ సభ డిమాండ్ 


న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణకు వెంటనే వరద సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆలిండియా కిసాన్ సభ ఉపాధ్యక్షుడు హన్నన్ మొల్లా డిమాండ్ చేశారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌‌‌‌‌‌‌లో అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధానకార్యదర్శి వెంకట్‌‌‌‌‌‌‌‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కురిసిన భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. 

తాగు నీటి సమస్య ఏర్పడిందని, పలు చోట్ల రోడ్లు కొట్టుకు పోయాయ న్నారు. రాష్ట్రంలో 10 లక్షల ఎకరాలకు పైగా పంట నష్టం జరిగిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి లేఖ రాసినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అంటే గుజరాత్ ప్రభుత్వమా? అని వెంకట్ విమర్శించారు. తెలుగు రాష్ట్రాల్లో వరదల గురించి కేంద్రానికి పట్టదా? అని ప్రశ్నించారు. జీఎస్టీ పేరుతో లక్షల కోట్లు తీసుకుని రాష్ట్రానికి కష్టం వచ్చినప్పుడు నిధులివ్వరా? అని ఫైర్ అయ్యారు.