జేసీబీని తగులబెట్టిన మావోయిస్టులు

 జేసీబీని తగులబెట్టిన మావోయిస్టులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:  చర్ల మండలంలో మావోయిస్టులు రెచ్చిపోయారు. తిప్పాపురంలో జేసీబీని తగలబెట్టారు. జిల్లాలో మున్సిపల్ అధికారులు తిప్పాపురం - బత్తినిపల్లి రహదారి పనులు జరుగుతున్నాయి. ఈ పనులు చేపట్టరాదంటూ మావోయిస్టులు వార్నింగ్ ఇచ్చారు. అయితే పనులు మాత్రం యధావిధిగా కొనసాగుతున్నాయి. దీంతో నిన్న రాత్రి మావోయిస్టులు తిప్పాపురం గ్రామానికి వచ్చి పనులు చేస్తున్న వారిని అడ్డగించారు. సాయుధులైన నక్సల్స్ హెచ్చరికలతో పనులు చేస్తున్న వారు దూరం వెళ్లిపోగా.. పనులకు ఆటంకం కలిగించేందుకు జేసీబీకి నిప్పు పెట్టారు మావోయిస్టులు. 
అలాగే చర్ల మండలం గీసరెల్లి అటవీ ప్రాంతంలో ఆదివారం రాత్రి ఫారెస్ట్ ట్రెంచ్ పనులు చేస్తున్న జేసీబీని తగులబెట్టిన మావోయిస్టులు.. మరో జేసీబీని తమ వెంట తీసుకెళ్లిపోయారు.