డీఎస్సీ 2008 కాంట్రాక్టు టీచర్లను రెన్యువల్ చేయాలి

డీఎస్సీ 2008 కాంట్రాక్టు టీచర్లను రెన్యువల్ చేయాలి
  • ప్రభుత్వానికి పీఆర్టీయూ విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డీఎస్సీ 2008 ద్వారా నియమితులైన కాంట్రాక్టు టీచర్లను రీఎంగేజ్ చేయాలని ప్రభుత్వాన్ని పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పుల్గం దామోదర్ రెడ్డి, సుంకరి బిక్షంగౌడ్  కోరారు. సోమవారం ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియాకు లేఖ రాశారు. కాంట్రాక్ట్ టీచర్లుగా  రిక్రూట్ అయిన సమయంలోనే మార్చి 2026 వరకు బడ్జెట్ కేటాయించారని, అయితే, ప్రస్తుతం కొనసాగింపు ఉత్తర్వులివ్వకపోవడంతో జీతాలు రావడం లేదని చెప్పారు.