
వరుస సినిమాలతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హల్ చల్ చేస్తున్నారు. నిన్నమొన్నటి వరకు పాలిటిక్స్ లో బిజీగా ఉన్న పవన్..ఇప్పుడు వరుస సినిమాలతో అభిమానుల్ని అలరించేందుకు సిద్ధమయ్యారు.
ఇప్పటికే దిల్ రాజు నిర్మాతగా వేణుశ్రీరామ్ డైరక్షన్ పింక్ రీమేక్ లో పవన్ లాయర్ గా యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో రెండు సినిమాలకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
క్రిష్ డైరక్టర్ గా, ఏఎం రత్నం నిర్మాతగా ఓ సినిమా త్వరలో ప్రారంభం కానుంది. తాజాగా పవన్ తన 28వ చిత్రానికి కూడా కమిట్ అయ్యారు.
పవన్ పరాజయాలకు అడ్డుకట్టవేసి గబ్బర్ సింగ్ తో ఆయన్ని మళ్ళీ హిట్ ట్రాక్ లోకి డైరక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. కొద్దిసేపటి క్రితమే ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్ గా ఎనౌన్స్ చేసింది.